బ్రాహ్మణపట్టు. జాతర విశేషం;-శ్రీమతి సి.కవిత. ; అనువాదం ; అచ్యుతుని రాజ్యశ్రీ


 తిరుపతి దగ్గర ఉన్న ప్రాంతం బ్రాహ్మణపట్టు.ఈజాతర విశేషం ఏమంటే ఎల్లమ్మ గ్రామ దేవతకి ఆమెఇద్దరు చెల్లెళ్ళు తోకల్పి ప్రతి ఇంటివారు రకరకాల నైవేద్యాలు పెట్టి  కేవలం బట్టలు ఉతికేవారికే ప్రాధాన్యత ఇస్తారు. ఆపైమేకలు ఆవులకి నైవేద్యం తినిపిస్తారు.ఇందులో కుల ప్రసక్తి లేదు. కేవలం శాకాహారం మాత్రమే నైవేద్యం!చాకలివారంటే ఊరిశుచి శుభ్రత ఆరోగ్యం వారిపైఉంటుంది. అందుకే వీరికే దేవతల మట్టి విగ్రహాలు తయారు చేసే అర్హత ఉంది.అక్కడ  అమ్మవారి గుడి ఎల్లమ్మ ని ప్రతిష్ఠ చేశారు. అది శాశ్వతంగా ఉంటుంది. ఆమె విగ్రహం ఇది.ఇక ప్రతి ఏడాది ఆగస్టు 12న ఏడు ఊర్లవాళ్లు కలిసి ఎల్లమ్మ ఆమె ఇద్దరు చెల్లెళ్ళు బాలమ్మ గంగమ్మ లను పూజించుతారు.మంగళవారం నాడు ఊరిమధ్యలో తాము మట్టితో చేసిన విగ్రహాలు సుమారు ఓ అడుగు ఎత్తు వి రజకులు తెస్తారు.వాటికి కళ్ళు మొహంనోరు అన్నీ వెండివి అతికిస్తారు.పాదాలు బంగారంవి పెడతారు.
ఆఊరిమధ్యలో విగ్రహాలను పెట్టి అలంకరిస్తారు. ప్రతి ఇంటిలోనించి  బిందెలోరాగి సంకటి తెచ్చి విగ్రహాల ముందు ఉంచి నైవేద్యం పెట్టి హారతిఇస్తారు.దాన్ని అందరికీ పంచుతారు. మంగళవారం సాయం త్రం  4గంటలకి బియ్యం బెల్లం తో చేసిన నైవేద్యం ని గుడి దగ్గర రాళ్లపొయ్యిపై వండి నైవేద్యం పెట్టి టెంకాయకొడ్తారు.బుధవారం కేవలం శాకాహారం వంటలతోప్రతి ఇంట్లో తెల్లవారుజాము 4-5గంటలకే సిద్ధం గా ఉంటారు. విగ్రహాలని పల్లకిలో మోస్తూ ప్రతిఇంటినుంచి ఆవంటకాలుపళ్లెంలో పెట్టి చాకలి వారికే ఇస్తారు. రజకులు మాత్రమే గుమ్మడి కాయకొబ్బరికాయ నిమ్మకాయ పగలగొడతారు.వారికి డబ్బు కూడా ప్రతిఇంటిలో నుంచి ముట్ట చెప్తారు. సరిగ్గా  మధ్యాహ్నం 12కి ఇంటినుంచి చెంబులో నీరుపోసి అందులో అన్నంవేసి గుడికి తీసుకుని వెళ్లి డ్రమ్ములో పోస్తారు.దాన్ని  ఆవులు మేకలు జంతువులు తింటాయి.సాయంత్రం అన్నంపై ములగాకు వేపుడు వేసి కుంభంలా పోస్తారు.ఆమట్టి విగ్రహాలని పారే నీటిలో వదులుతారు.వెండి బంగారు వస్తువులు తీశాక నీటిలో కరిగిన ఆమట్టిని ప్రతి ఇంటికి  పంచుతారు.ఇంట్లో పూజలో పెట్టుకుంటారు.మొక్కులు చీరెలు సమర్పిస్తారు.ఇలా జాతర పేరుతో కులాలకి పశువులకి ప్రాధాన్యత నిచ్చే జాతరలు గ్రామసమైక్యతకు నిదర్శనం కదూ🌹
కామెంట్‌లు