పాఠశాలలో బాలిక పుట్టినరోజు వేడుకలు


 కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో  మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని తాండ్ర సాయివర్షిణి పుట్టినరోజు వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రత్యేక చొరవ తీసుకొని గత తొమ్మిదేళ్లుగా పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థుల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం సాయివర్షిని పుట్టినరోజు కావడంతో ఈర్ల సమ్మయ్య తన సొంత ఖర్చులతో కేక్ తెప్పించి బాలిక పుట్టినరోజు వేడుకలను విద్యార్థిని, విద్యార్థులు, పాఠశాల పిల్లల కరతాళ ధ్వనుల మధ్య ఘనంగా జరిపించారు. పుట్టినరోజు వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించినందున పాఠశాల పిల్లలందరూ మిక్కిలి సంతోషపడ్డారు. ఆనందంతో గంతులు వేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ....  పిల్లలు బడి పట్ల ఇష్టాన్ని పెంచుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. బాగా చదివి ఉన్నత స్థానంలో నిలవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని బాలికను ఆయన దీవించారు. అనంతరం ఆయన బాలిక చేత కేక్ కట్ చేయించారు. మిగతా ఉపాధ్యాయినులు అమ్మాయికి కేక్ తినిపించి ఆశీర్వదించారు. తర్వాత పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు కర్ర సమత, చెన్నూరి భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు