ఉపాధ్యాయునికి 'ఆచార్య దేవోభవ 'పురస్కారం

 శ్రీకాళహస్తి:పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, కవి, రచయిత, మిమిక్రీ కళాకారులు కయ్యూరు బాలసుబ్రమణ్యం వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి,యూత్ హాస్టల్ లో  నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో 'ఆచార్య దేవోభవ' పురస్కా
రం అందుకున్నారు. పాఠశాల మౌలిక వసతులు, సృజనాత్మక బోధన, సాహిత్యం,కళలు , సామాజిక సేవా మొదలగు రంగాల్లో బాలు చూపుతున్నప్రతిభకు గాను ఈ పురస్కారం లభించిందని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పైడి అంకయ్య అన్నాడు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగాహేమమాలిని,మధుసూదన్,గోపాల్,విజయకుమార్ ,సుజయ్ ,వేణు గోపాల్ తరులు పాల్గొన్నారు.బాలుకి అవార్డు రావడం పట్ల పలువురు ఆయనను అభినందించారు.
కామెంట్‌లు