బాల్యం తిరిగొస్తే; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
అంతా ఆనందమే అనుకుంటున్నారా
అంతా కొత్తదన మే అంతా ప్రశ్నార్థకమే

మన ఆటలు నేల బండ , చారు పప్పుచారు 
ఇప్పుడు వీడియో గేమ్స్ తో మనం బేజారు
పలకా బలపం పట్టి దిద్దినము మనం ఆనాడు
ఆన్లైన్ క్లాసుల్లో ఇంగ్లీష్ స్పీకింగులు ఈనాడు

చెరువుల్లో చేప పిల్లల్లా ఈతలు కొట్టాము ఆనాడు
స్విమ్మింగ్ పూల్స్ లో డ్రెస్సులు,కళ్లజోళ్లు ఈనాడు
భుజం పైచేతులు వేసి చెట్టా పట్టలతో స్కూలుకు
వీడియో కాల్ లలో హాల్లో హాయ్ లు మాత్రమే నేడు

స్వ చమైన గాలి తోచెట్ల కింద చదువులు ఉల్లాసంగా
మూసిన తలుపుల జైళ్ల మధ్య ఖైదీల్లా నీరసంగా
అమ్మ ఒడిలో పడుకుని కధలు వింటూ గోరుముద్దలు
ఒంటరిగా ఫ్రిజ్ లోవి మైక్రోవేవ్ లో పెట్టీ ఫోర్క్ ల పిజ్జాలు

నాన్నమ్మ తాత,ఉమ్మడి కుటుంబాల ప్రేమలు ఆనాడు
సింగిల్ చైల్డ్ తప్ప సిబ్లింగ్ అంటే తెలియని వారు ఈనాడు
గల గల లు,కిల కిల లు బాల్యమంతా నవ్వులే నవ్వులు
నవ్వడానికి టైం పెట్టుకుని లేని నవ్వు తెచ్చుకుని ఈనాడు

బాల్యం తిరిగోస్తే అంతా బంది ఖానా లు,జీవితం
బాల్యం తిరిగొస్టే రాంకుల గోలలు మార్కుల మయం.

కామెంట్‌లు