పూవు-భాగాలు (గేయం) అచ్యుతుని రాజ్యశ్రీ
పుటదళములు..
దళముల మేమే!పుటదళముల మేమే!
పచ్చని ఆకుపచ్చని  మెత్తని దళముల మేమే!
మొగ్గలా సున్నితపు నిగ్గులా
రక్షించే దళముల మేమే!
ఎండావాన మంచునించి కాపాడే ఆహారమ్ము తయారు చేసే దళముల మేమే!

మకుటదళములు...
దళముల మేమే!మకుటదళముల మేమే!
రంగు రంగుల ఇంపుగొలిపే
సొంపులతో సువాసన జల్లే 
దళముల మేమే!కిలకిల నవ్వే
ఘుమఘుమ లాడే  దళముల మేమే! కీటకాలు పశుపక్షుల 
పిన్నలపెద్దల నాకర్షించే
ఆకర్షక పత్రాలము!

సరములమేమే! కేసరములమేమే! కేసరదండము పరాగకోశము
పరాగరేణువు మాలో భాగాలే!
పూవుకి ప్రాణంమేమే! ఫలాల నొసగే తీయని ఫలాల నొసగే
భాగపు సరాలము మేమే!

కాయ-పండు...
కాయలము కూరగాయలము!
పుష్టిని ఇచ్చే కూరలము!
ఫలములము-తీయని ఫలములము!
నోరూరించే జీవనదాతలము!
కాయలు ఫలములు ఉంటేనే 
ప్రకృతికి శోభ! ఇవి తింటేనే మనిషికి జీవనప్రభ!

తరువే మాతండ్రి! పూవే మాతల్లి! కీటకాలే మాభ్రాతలు!
కూరలు ఫలములు తింటేనే
అందం ఆరోగ్యం!రోగాలు రొచ్చులూ మటుమాయం!
దేశం కళకళలాడు
పిల్లల నవ్వులు విరబూయు🌹

కామెంట్‌లు