శబ్ద సంస్కృతి! సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ

 హిందీ లో అభ్యర్థన అంటే గౌరవ సన్మానం కోసం ముందు కి సాగటం.కానీ సంస్కృతంలో ప్రార్ధన అని అర్థం.బెంగాలీ భాషనించి హిందీ లో కి వచ్చి ంది ఈపదం! బెంగాలీ లో అర్థం స్వాగతం చెప్పటం. స్వాగతం సమితిని అభ్యర్థనా సమితి అంటారు.మరాఠీ గుజరాతీ లో కూడా స్వాగతం అనే అర్థంలో లోనే వాడుతారుఅనువాదం అంటే ఒకభాషలోంచి ఇంకో భాషలోకి అనువాదం తర్జుమా చేయడం అని వాడు తున్నారు.అను అంటే తర్వాత  వాద్అంటే చెప్పటం అని అర్ధం.ఏభాషలోనైనా విభిన్న విధానం లో చెప్పడం అనే అర్థంలో వాడేవారు.కానీ ఇప్పుడు దాన్ని ట్రాన్స్ లేషన్అని అంటున్నారు.ప్రాచీనకాలంలోతర్కశాస్త్రంలో ఎదో ఒక పదం మాటిమాటికీ రిపీట్ చేయటం లేదా వేరే విధంగా వేరే రూపంలో చెప్పడం ప్రత్యక్షప్రమాణాలు చూపడంని అనువాదం గా అనేవారు.కానీ నేడు ఒక భాషలోని వ్యాసం కథను వేరే భాషలో రాయడం ని అనువాదం అంటున్నారు.ఉల్థా తర్జుమా అనే పర్యాయ పదాలు ప్రయోగించడం వాడుకలో ఉంది.🌹
కామెంట్‌లు