అసిస్టెంట్ ఇంజనీరుగా శ్రీమతి ఎస్. రత్నలక్ష్మి కి సన్మానం

  మోక్షగుండం విశ్వేశ్వరయ్య  జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే సందర్భంగా నంద్యాల జలవనరుల శాఖలోని తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి ఎస్. రత్నలక్ష్మి గారిని  నంద్యాలలో గల రోటరీక్లబ్ సంస్థ అధ్యక్షులైన  ప్రముఖ డాక్టర్ V. అనిల్ కుమార్ గారుకార్యదర్శి N.C. మోహన్ రెడ్డిగారు, ఇతర కార్యవర్గ సభ్యులు ఇంజనీరైన రత్నలక్ష్మి గారు అటు వృత్తిరీత్యా,  ఇటు ప్రవృత్తిరీత్యా అద్భుతంగా రాణిస్తూ నంద్యాలకు కీర్తి ప్రతిష్టలు తెస్తున్నారని అభినందిస్తూ  కాశ్మీర్ శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా పుర ప్రముఖులు, సహోద్యోగులు, కవులు, కవయిత్రులు రత్నలక్ష్మిని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.
 
కామెంట్‌లు