బాలలోకం;--చిటపట చినుకులు;--గుడిపూడి రాధికారాణి, మచిలీపట్నం,

బుడిబుడి అడుగులు వేసే బుడుగులు 
నడకను పరుగుగ మార్చే పిడుగులు
 గణగణ గంటలు మోగక ముందే
 చకచక నడకలు బిరబిర పరుగులు

 సాయంకాలం సందడి చేయుచు |
ఆదివారాలు ఆటలు ఆడుచు 
ఆటలు పాటల ఆనందముతో 
హరివిల్లులమని మెరిసే పిల్లలు 

తెల్లని మబ్బులు నల్లగ మారగ
తళతళ మెరుపులు నింగిని
 మెరయగ చిటపట చినుకులు 
చల్లగ రాలగ కళకళలాడుతు 

మురియును పిల్లలు గలగల 
పారెడి వర్షపు నీటను చకచక 
కాగిత పడవలు వేయుచు
 కిలకిల నవ్వులు నవ్వెడి పిల్లలు 
పుడమిని విరిసిన తెల్లని మల్లెలు


కామెంట్‌లు