తాంతియా భీల్(టండ్రా) అచ్యుతుని రాజ్యశ్రీ

 తాంతియా భీల్ ని ఓదొంగ  బందిపోటుగానే చూశారు జనమంతా! అతను అలామారటానికి గల కారణాన్ని ఎవరూ ఎత్తి చూపరు.అతని అసలుపేరు టండ్రా! అది క్రమంగా  తాంతియా గా మారింది. 1842లో విరదా అనే పల్లెలో భీల్ జాతిలో పుట్టాడు. తండ్రి రైతు..భావూ సింహుడు.టండ్రా బాల్యం నించి బలం నిర్భయత్వం కలవాడు. 30వ ఏట తండ్రి తల్లి  చనిపోయారు.పొలాలు ఎండినా పట్టించుకోలేదు.కానీ బతకటంకోసం పొలం పనులు మొదలు పెట్టగానే భూమి కబ్జా చేయాలనే దురాశతో పటేల్ పట్వారీలు కుట్రలుపన్ని జైల్లో పడేయించారు.ఏడాది జైలు శిక్ష అనుభవించి దాదాపు  8ఏళ్ళు  కూలీగా శ్రమించాడు.కానీ పోఖర్ ప్రాంతవాసులు అతన్ని సతాయించి దొంగతనం నేరం అంటగట్టి జైల్లో పడేయించారు. కానీ నిర్దోషి గా  కోర్టు ఆదేశంతో బైట పడినా పోలీసులతో జగడా ఐంది. మళ్ళీ  జైల్లో పడేయించాలని పోఖర్ వాసులు యత్నించారు. అంతే! వారిపై పగ ప్రతీకారం  కోపం పెరిగి బిజనియా అనేఓ క్రూరవ్యక్తిని ఆశ్రయించాడు.ఓముఠాగా ఏర్పడి కొండలు గుట్టలపై ఉంటూ  లూటీలు దొంగతనాలు చేయసాగారు.పోఖరా కీ చెందిన ఓపటేల్ తీయని మాటలతో బోల్తా కొట్టించి  జైల్లో పెట్టించాడు.తాంతియా  కన్నం పెట్టి బైట పడి ఆంగ్లపోలీసులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు.గొప్పోళ్ల పనిబట్టి బీదలకి పంచేవాడు.పోఖర్ గ్రామాన్ని తగలబెట్టి పటేల్ని చంపి అతని భార్య పిల్లలని వదిలేశాడు. 400పైగా లూటీలు చేశాడు. పేదలపెన్నిధిగా పేరు గాంచాడు.టండ్రా మామా అని పిల్లలంతా అతని చుట్టూ చేరి అచ్చట్లు ముచ్చట్లతో ఓహీరో లా ఆరాధించేవారు. టండ్రా పోలీసు  అనే దళాన్ని  ఏర్పాటు చేసి దోపిడీలు లూటీలతో పాటు తనను హింసించేవారి పల్లెలు భస్మం చేశాడు. నమ్మకం ఉన్న మిత్రుడు గణపతి అనేవాడు  రక్షాబంధన్ రోజే టండ్రా ని పోలీసులకి పట్టించాడు.1888లో జబల్పూర్ లో ఉరి తీశారు. మధ్యప్రదేశ్ లో  ఇప్పటికీ అతన్ని తాంతియా మామా అనే పిలుస్తూ అతని చరిత్రను కథలుగా చెప్పుకుంటారు.మంచి మనిషిని చెడ్డవాడిగా మార్చే ద్రోహులు నేటికీ ఉన్నారు 🌹
కామెంట్‌లు