తూరుపుతోటలో
రోజూ విరిసే సువర్ణపుష్పం
వెలుగులు తోటలోనే కాదు
లోకానికంతా విరజిమ్మే
వెలుగుల పుష్పం
విరిసిన తోటకు
అద్దం పడుతూ సంబరపడే
సాగర జలం
పెదవులు కదలకనే
కబురులు చెబుతున్న గాలి
మాట పెగలని అద్భుతాన్ని
చూసి మ్రాన్పడిపోయింది.
తలవూస్తూ వింటున్న
పచ్చని మొక్కలు
వెచ్చగ విరిసిన
వేకువపువ్వును
ఒళ్ళంతా పువ్వులకళ్ళతో
చూసి వింజామరలతో
స్వాగతించాయి..
మనసు పరవశించే
ప్రభాతవేళ
పరిమళించే మనసు పాడే
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి