సుప్రభాత కవిత ; -బృంద
ఎప్పటినుండో మదిలో
విరిసిన చిన్ని చిన్ని
కోరికల మొగ్గలు...

కాలక్రమాన రేకులు
విప్పి రెక్కలు తొడిగి
రెపరెపలాడి 

రివ్వు రివ్వున చుట్టుముట్టి
వరుసకట్టి వరించే వేళ

మురిసిన మనసున
కురిసిన అమృతపుజల్లు

అందని ఆకాశపు హరివిల్లు
నెక్కి గగనవిహారం చేసే
మనసును ఆపే ఆలోచనే లేక

అబ్బురంగ చూస్తున్న
అమాయక హృదయం

అందీ అందని అందమైన
రంగుల సీతాకోకచిలుకలను
దోసిట్లో నింపుకుని
స్వేఛ్ఛగా  వదిలేస్తే

పొందే అపురూపమైన 
అనుభూతి

సంతోషం సముద్రమంత!
ఆనందం ఆకాశమంత!
సంబరం జీవితమంతా!

నిండాలని ఉండాలని
కోరుకుంటూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు