అట్లు తద్దొయ్ ఆరట్లోయ్; - డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
అట్లతద్దోయ్ ఆరట్లోయ్
ముద్ద పప్పొయ్ మూడట్లోయ్
ఆడవాళ్ల పండగ అట్ల పండగ
ఉయ్యాల లు ఊగే పండగ

తెల్లవారు జామునే నిదరలేచి
ఇల్లంతా రంగవల్లులు దిద్ది
అన్నం పులగం వండుకుని
చీకట్లో నే అన్నం తినేసేము

పసుపు గౌరమ్మను జేసీ
పూలు పెట్టీ పూజించి
ఐదవతనము నే కోరుకుని
వాయినాలు ఇచ్చేము తల్లి.

తాంబూలం సమర్పించి
 చెట్లకు ఉయ్యాల లు కట్టి
అట్లు తింటూ, ఉయ్యాల ఊగి
అట్లతద్ది నోము పూర్తి చేసేము.
గౌరమ్మ నీ మోగుడేవరమ్మా
పాటలు పాడి,ఆటలు ఆడి
రోజంతా సంతోషాల సంబరాలు
కన్నెపిల్లలు కోలాట నృత్యాలు.


కామెంట్‌లు