సుప్రభాత కవిత ; -బృంద
ప్రభాతవేళ పరిమళించు
ప్రసూన శ్రేణికి

ప్రభవించు ప్రభాకరుని
మయూఖముల స్పర్శ

పులకించు పుడమి
పరవశించు ప్రకృతి

కనుచూపు చాలని
కమనీయ దృశ్యాలు

మదిని నింపుకుని
మురిసే హృదయాలు

పెదవిపై దరహాసాలు చిందగ
మధురిమల పొంగించె మానసము

అందరికి ఆనంద మకరందములు
పంచ 
ఏతెంచె విభుడు వినువీధిని

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు