మోహం!అచ్యుతుని రాజ్యశ్రీ

 పురాణ ప్రవచనం జరుగుతోంది. రామయ్య తాత వింటున్నాడు కానీ మనసు మనసులో లేదు. రేపు తన మనవడు పైచదువులకోసం అమెరికా వెళ్తున్నాడు.కొడుకు కోడలు అధ్యాపకులు. ఒక్కగానొక్క మనవడిని  పసితనం నుండి భుజాల పై ఎత్తుకుని మోశాడు.తన భార్య వాడికి లాలపోసి బువ్వతినిపించి ఆలనాపాలనా చూసింది. కానీఏడాది ఐంది ఆమె దేవుని ఒడిచేరి! కొడుకు కోడలు ఎప్పుడూ బడిపనుల్లో హడావిడి ఉక్కిరిబిక్కిరి గా పరుగులు పెడతారు.ప్రైవేటు బడి పంతుళ్ల  గతి అంతే! సెలవు రోజున కూడా ట్యూషన్ తో సతమతం అవుతుంటారు.తుమ్మితే ఊడే ముక్కులు ఆఉద్యోగాలు! మనవడు  ఒద్దికగా బుద్ధి గా పెరిగి మంచి మార్కులతో బి.టెక్. పాసైనాడు.తమతాహతుకి మించిన దైనా యు.ఎస్.కి పంపుతున్నారు పై చదువుల కోసం! తాతకి సర్వస్వం మనవడే! ఇద్దరు ఒకే గదిలో చిన్నప్పటినుంచి  పడుకుంటున్నారు.తాత కి పౌరాణికుని మాటలు చెవిన పడుతున్నాయి. "ఈశరీరం ఉన్నంత వరకే బంధాలు  అనుబంధాలు! అభిమన్యుడి కోసం ఏడుస్తున్న పాండవులతో ఏమన్నాడు "మీరెవరో నేనెవరో?" మన బాధ్యతలు తీరాక దైవస్మరణ లో భక్తిలో మునగాలి.రావణుడి శవాన్ని చూసి  తల్లి దూరంగా పారిపోతోంది.ఏడవటంలేదు.జానపద కవుల ఊహాగానపు రామాయణ కథలు ఇవి!"రామా! నారావణుని మరణం తో నాగుండె బద్దలు కాకూడదు. నేను సదా భగవధ్యానంలో తరించాలనే   ఇక్కడనించి దూరం గా పోతున్నాను."ఇక లక్ష్మణుడు ఇలా అన్నాడు "నీపరాక్రమం ధాటికి రావణుడు  కుప్ప కూలాడు"అని.అప్పుడు రాముడు ఏమన్నాడో తెలూసా?"కాదు తమ్ముడూ!పుత్రశోకంతో తనువు చాలించాడు."భక్తి అనేది ఎలా ఉండాలో తెలుసా? ఓసాధువు సదా దైవప్రార్థన చేసేవాడు.మంచినీరు తాగుదామని గ్లాసు నోటి  దగ్గర పెట్టి  కూడా గుటకవేసి నీరు మింగే లోపల నామజపం ఆగుతుంది అని సందేహం తో ఆగిపోయేవాడు.బంధుప్రీతి అన్నిటిపై వ్యామోహం  తగ్గించుకోవాలి.మానవ జన్మ ను సార్ధకం చేసుకోవాలి"తాత మనసు లో  ఆమాటలు పదేపదే మారుమోగుతున్నాయి.హు!ఎంత పిచ్చివాడు తను!? తన అమ్మా నాన్న లు ఊహతెలిశాక పోయారు.నలభై ఏళ్ళు తనతో కష్టసుఖాలు పంచుకున్న ఇల్లాలు పోయింది. ఇప్పుడు అసలు కన్నా  వడ్డీ ముద్దు  అనే భ్రాంతిలో మనవడికోసం ఏడవటం ఎంత అవివేకం! తాత మనసు ఇపుడు ప్రశాంతంగా ఉంది. దైవస్మరణ చేస్తూ ఇల్లు చేరాడు🌹
కామెంట్‌లు