టిట్ బిట్స్!సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
 మౌలానా ఆజాద్ జైల్లో ఉన్న ప్పుడు ఓచైనాజాతీయుడు కూడా ఉన్నాడు.కానీ  ఇద్దరికీ భాషాసమస్య.ఓరోజు  అతను మౌలానాని అభినయంతో ప్రశ్నలు సంధించాడు."ఓపియమ్?"మాదకద్రవ్యాలనేరం చేశావా అని  అతని అభిప్రాయం!"ఉహు!"తల అడ్డంగా ఊపాడు ఆజాద్. తన చేతిని మెడపై కత్తిలా పెట్టి "హత్య చేశావా?"చైనా వ్యక్తి  అభినయంకి"ఉహు"మౌలానా జవాబు!"ఓ గాంధీ!"  "ఆ..ఎస్..ఎస్" ఆయన స్వాతంత్ర్య పోరాట వీరుడని  ఆచైనీయునికి అర్థం ఐంది
లోకమాన్యతిలక్ మహామేధావి నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు అనేసేనైజం!మహాబోళా చిన్నా రి ఆరోజు క్లాస్ లో మాష్టారు పాఠం చెప్తుంటే బైటికి చూస్తున్నాడు.బైట పిల్లలు గోలగోల గా అరుస్తూ ఆడుతున్నారు."తిలక్! నేను పాఠం చెప్తూనే ఉన్నా.నీబుర్ర ఎక్కడ? ఇప్పటిదాకా నేను చెప్పిన ది వివరిం చు.లేదంటే నీవీపు విమానం మోత మోగిస్తా". అంతే టకటకా తు.చ.తప్ప కుండా మాష్టారు చెప్పినది వివరించారు.అంతా డంగైపోయారు అని వేరే చెప్పాలా?
ఆయన 1907లో పూనాకి బైలుదేరారు."బద్మాష్ లు మీపై దాడి చేయవచ్చు"అని అంతా హెచ్చరించారు."ఆంగ్ల పోలీసుల సాయంతీసుకునే కన్నా నాదేశవాసుల చేతిలో చావటం మేలు."ఆయన కి అంతిమ ఘడియలు సమీపిస్తున్న తరుణంలో రాత్రి రెండు గంటల కు డాక్టర్ బలవంతంగా మందుతాగిస్తే"ఏంటి?మందు నేను తాగను" అని మొండి కేశారు."నల్లానీరు తాగండి". "ఒహో! మున్సిపల్ కార్పొరేషన్ కి కూడా నాజబ్బు వచ్చిందా?" అని పకపకా నవ్వారు.
ఒకసారి మీరాబెన్ రైల్లో థర్డ్ క్లాస్ లో పయనిస్తోంది.కత్తిరించిన జుట్టు!చున్నీ లేదు.మెడ చేతులు బోసిగా ఉన్నాయి.టిసి  వచ్చి"సార్!ఇది లేడీస్ బోగీ! వేరే దాని లో కూచోండి" అనగానే దుపట్టా తీసి పైన కప్పుకుంది.ఆమె గాంధీ శిష్యురాలు అని గుర్తు పట్టాడు టి.సి.
 రాజర్షి రాజేంద్ర ప్రసాద్ జీవితాంతం ఆస్తమా తో బాధపడ్డారు. తన పుట్టినరోజు నాడు తెల్లారి నిద్రలేస్తూనే డైరీలో ఇలా రాశారు"హేభగవాన్!రాజ్వంశీదేవి నాభార్యగా లభించడం నాఅదృష్టం!గాంధీజీ నాగురువు.దేశప్రజల ప్రేమ ఆప్యాయత  అభిమానం పొందుతున్నాను.ఆధ్యాత్మిక మార్గంలో  పయనిస్తూ నా ఇహలోకయాత్రను ముగిసేలా అనుగ్రహించు."🌷

కామెంట్‌లు