-కూతురు ; - ఎం. వి. ఉమాదేవి
బాల పంచపది 
=============
అమ్మకి మరోరూపు కూతురు 
పుడితే సంబరాలు చేతురు 
శ్రీలక్ష్మి పుట్టినది అందురు 
మెట్టినింట పార్వతను కుందురు 
అభిమానం చూపేకూతురు.. ఉమా!

నాన్న గుండెలమీద ఆడును 
అమ్మకి సాయంగా ఉండును 
అన్నదమ్ములన్న ప్రేమ మెండును 
ఆడపిల్లమనసు పూల చెండును 
మలిసంధ్యకి ఆసరా ఉండును.. ఉమా!

కామెంట్‌లు