జీవితంలో సమర్థుడు అసమర్థుడు అని రెండు రకాలు. సమర్థత కలిగిన వాడు తనను తానునమ్ముకున్న వాడు. తాను చేసే కృషి పైన తాను తీసుకున్న నిర్ణయాల పైన సమగ్రమైన అవగాహనతో పాటు శక్తియుక్తులు కూడా కలిగిన వాడు సమర్ధుడు. ఇక అసమర్థుడు ఉంటాడు అతనిని బద్దకస్తుడు అని కూడా అంటారేమో. సమర్థత లేకపోవడం వేరు బద్ధకంగా ఉండడం వేరు సమర్థత కలిగిన వారు కూడా ఒక సందర్భంలో బద్దకించి ఆ పని చేయక పోవచ్చు. బద్ధకస్తుడు మాత్రం ప్రతిసారి బద్ధకం గానే ఉంటాడు. తాను మంచి నీళ్లు తాగాలన్నా ఎదుటివారి సహకారమే కావాలి అది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఎవరివల్ల దానికి కారకులు ఎవరు ఏ కారణమైనా తల్లిదండ్రులే అనేది నా నమ్మకం. ఎందుకు ఆ నమ్మకం కలిగిందో మీకు మనవి చేస్తాను. మా గ్రామంలో ఉన్న రెండు ఉదాహరణలు మీకు చెప్తాను. ఎందుకు బద్ధకస్తుడు అవుతాడు అన్న దానికి నాకు తెలిసిన సమాధానం తల్లిదండ్రులు సంపాదించిపెట్టిన ఆస్తిపాస్తులు ప్రధాన కారణం. ప్రతి విషయానికి ఇతరుల మీద ఆధారపడే మనస్తత్వం కలగడం రెండవ కారణం. నేను కష్టపడక పోయినా పరవాలేదు వల్ల భరోసా రావడం. మరి కష్టజీవి ఎలా ఆలోచిస్తాడు ఎవరి దగ్గర ఏదీ కావాలని యాచించడు ఇతరుల సంపాదన నాకు రావాలని ఆశించడు. తన కష్టాన్ని నమ్ముకున్నాడు, తన శక్తియుక్తుల ద్వారా కుటుంబ పోషణ చేయగల భరోసా వుంటుంది. ఆ కుటుంబంలో ఉన్న భార్య భర్త రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లలకు ప్రేమను పంచుతూ తమ కష్టార్జితంలో ఇతని విద్య కోసం కొంత పొదుపు చేసి అతనిని ఇతర దేశాలలో కూడా చదివించగల స్థితికి వచ్చాడు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కూడ పెడితేనే కొండలా పెరుగుతుంది అని మన పెద్దలు చెప్పిన సూక్తిని మనసా వాచా కర్మణా నమ్మి తల బిడ్డలకు తల్లి బీజం వేయాలి ఎవరి పని వారు చేసుకోవటంలో నిష్ణాతులు కావాలి ఎదుటివారి మీద ఆధారపడకూడదు అన్న ఎరుక పిల్లలకు నేర్పాలి. పని అన్నది భగవత్ స్వరూపంతో సమానమని చెప్తారు పెద్దవాళ్ళు భగవద్గీతలో గీతాకారుడు కూడా కర్మ చేయడం కోసమే నీకు అధికారం ఇచ్చాను అని చాలా స్పష్టంగా తెలియజేశారు ఆ బాధ్యతను అమ్మ స్వీకరించి ఆ బిడ్డను పరిణతి చెందిన పరిపూర్ణమైన వ్యక్తిగా చేయవలసిన అధికారం అమ్మ చేతిలో ఉంటుంది కనుక ప్రతి బిడ్డ దేశానికి ఉపయోగపడే విధంగా సమాజ సేవఎలా చేయాలో తన స్తోమత నెరిగి మొత్తం కాకుండా చేయగలిగిన సేవ ఎలా చేయాలో అమ్మ మాత్రమే చెప్పగలదు. అందుకే అమ్మ లకే నా మాటలు.
సమర్థుడు అసమర్థుడు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి