మధురం మధురం మధురం
తెలుగుగళం బహుమధురం
అజంతం మహాశ్రావ్యం
రాగానుకూలం రమ్యం
తెలుగుపాట అతిసుందరం
తెలుగుమాట కడుమధురం
తెలుగునోట కురియుఅమృతవర్షం
తెలుగునాట నిలుచుఅమరగానం
పల్లెపాట జానపదం
పారద్రోలు పనిభారం
పట్టణపాట వినోదభరితం
పంచిపెట్టు ప్రమోదం
కవులకుపాటలిచ్చు ప్రేరణం
కవ్వించివ్రాయించు కవిత్వం
కవులకవనం కమనీయం
కవిసమ్మేళనం కడుగుల్యం
ఆంధ్రులపద్యం అద్భుతం
ఆసాంతం గణాలకూటం
తెలుగునాటకం చూడచోద్యం
తెలుగొళ్ళఅభినయం అభినందనీయం
తెలుగుమాండలీకం ప్రాంతాలకుప్రత్యేకం
తెలుగుయాసవేషం విభిన్నంవిచిత్రం
భావకవిత్వం భాసిల్లునిరంతరం
ప్రణయకవిత్వం పంచునానందం
త్యాగయ్యసంగీతం రాగాలసుసంపన్నం
అన్నమయ్యకీర్తనం శ్రీహరివాసధ్యానం
రామదాసురాగం భద్రాచలస్ఫురణం
క్షేత్రయ్యపదం మొవ్వగోపాలమననం
ఘంటసాలగళం గాంధర్వగానసమం
అమృతతుల్యం ఆనందదాయకం
బాలూకంఠం మధురాతిమధురం
కర్ణాలకుప్రియం కలిగించువినోదం
మధురం మధురం మధురం
తెలుగుగళం బహుమధురం
అజంతం మహాశ్రావ్యం
రాగానుకూలం రమ్యం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి