తనదాకా వస్తే!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు పేరెంట్ టీచర్స్ మీటింగు!అప్పటిదాకా ఎ-గ్రేడ్ ఫస్ట్ రాంక్ వచ్చిన తమపిల్లలకు మార్కులు గ్రేడ్ తగ్గటంతో అమ్మలంతా టీచర్ల పై దాడి చేస్తున్నారు. మాటల యుద్ధం సాగుతోంది. "ఆఇంగ్లీష్ టీచర్ ఎప్పుడూ మార్కులు కట్ చేస్తుంది. కామా ఫుల్ స్టాప్   
కాపిటల్ లెటర్ రాయకున్నా మార్కులు కట్ చేయటం అన్యాయం!ఇక హిందీ టీచర్ "అంగూర్"అన్న పదం లో అ పైన చుక్క పెట్టకపోతే "అగూర్" అని రాశావని మార్కువేయదు.తెలుగు టీచర్ సరిగ్గా తెలుగు చదవటంరాదు అక్షరాలు శుద్ధ తప్పులని రోజూ గుణింతాలు రాసి తెమ్మంటుంది.అందుకే మాపిల్లలకి రాంక్ గ్రేడ్ తగ్గింది.ట్యూషన్ లో అన్నీ కరెక్ట్ రాస్తారు మాపిల్లలు!"
వారి మాటలు విన్న హెచ్. ఎం.అందుకుంది"చూడండి!భాష భావం ఇప్పుడు తప్పుల తడక ఐతే రేపు టెన్త్ లో ధన్ మని ఫేల్ అవుతారు.స్కూల్ తెరచి దాదాపు ఆరునెలలు కావస్తున్నా మీటింగులకి మీరు హాజరు కాలేదు. మార్కులు తగ్గటంతో పరుగులు పెడ్తూ వచ్చారు. మీకో కథ చెప్తా వినండి. ఆరాజ్యం సుభిక్షంగా ఉంది. కానీ కొందరు మంత్రులు  అధికారులు అవినీతి పనులు చేస్తున్నా ఎవరూ కిక్కురుమనడం లేదు. పైగా వారితో లాలూచి అయ్యే దొంగవ్యాపారులు బైలుదేరారు.రాజు అందరినీ గమనిస్తూ తమాషా చూస్తున్నాడు.ఒకసారి  అడవి మృగం వచ్చి గొర్రెను ఎత్తుకుపోయింది.ఇలా వరుసగా కోడి మేక మాయం అవటంతో జనాలు గగ్గోలు పెట్టసాగారు."రాజు గారు  మంత్రులు  అధికారులు ఏంచేస్తున్నారు?" అంటూ పురవీధుల్లో గుమిగూడి చర్చలు మొదలు పెట్టారు.రాజోద్యోగులు కులాసాగా దిలాసాగా తిరుగుతూనే ఉన్నారు. రాజు మంత్రి మారువేషాల్లో అంతా గమనిస్తున్నారు.ఆరోజు ఓపెద్ద సభ ఏర్పాటు చేసి రాజు ప్రజల తో ఇలా అన్నాడు "ఇన్నాళ్లు మీరు ఇతరుల కష్ట సుఖాలు పట్టించుకోలేదు.రెండు రోజుల బట్టి మీపశువులు జంతువులు మాయం అవుతున్నాయి అని  ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారా? మీరే లంచాలు ఇచ్చి పనులు జరిపించుకుంటున్నారు.పన్నులు ఎగ్గొడుతున్నారు.ఏదైనా తనదాకా వస్తేనే తెలిసేది."అంతే ప్రజలు కిమ్మనలేదు....హెచ్. ఎం.మాటలు విన్న అమ్మలు ఇంక నోరెత్తలేదు. ఇన్నాళ్లు  పేరెంట్ టీచర్ మీటింగ్స్ కి హాజరు కానందుకు ఆమె మాటలకు సిగ్గుతో  తలొంచుకుని ఇంటిదారి పట్టారు 🌹
కామెంట్‌లు