దురభిమానం; డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్
అభిమానం ఉండొచ్చు కానీ ప్రాణాలు పోగొట్టుకునటార 
అట అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఎక్కడ చూస్తే ఏమిటి
క్రికెట్ పిచ్చి తో  అమాయక యువత ఊపిరి వదిలేస్తుంది
అలివి మాలిన గుంపు లో ఊపిరాడక చస్తున్నారు

వీళ్ళ పిచ్చి క్రికెట్ అసోసియేషన్ కు ఆనందం
టీవీ లో న్యూస్ కోసం ప్రత్యక్ష టికెట్ల అమ్మకాలు
ఎంత మంది చస్తే అంతగా పాపులర్ అవుతుంది
ఫ్రీ పబ్లిసిటీ కోసం ఎంత నీచానికైనా దిగజారుడు

అమ్మాయిలు సైతం అబ్బాయిలతో పోటీ పడుతూ
సమాన హక్కులు పొందే ఆనందం లో ఉన్నారు
పబ్బులు, ద్రగ్గులు,మర్డర్లు మోసాళ్లో ముందడుగు
అన్నిటా సమానం, మేమేమీ తక్కువ కాదు మరి

టికెట్ల అమ్మకాలు, ఆటల బెట్టింగులు, ఇదో జూదం
కుటుంబాల్లో సమస్యల్ని పట్టించుకునే టైం లేదు
అమ్మా నాన్న లకు అన్నం పెట్టే సమయం లేదు
పనికిరాని క్రికెట్ కోసం గుంపుల్లో నలిగి చస్తారు

దేశం ఎటు పోతోంది,చదువు జ్ఞానం ఎమై పోతోంది
చదువుకుంటే జ్ఞానం వస్తుందని ప్రోత్సహించారు
హైటెక్ మోసాలు చైన్ స్నాచర్ల గా మారుతున్నారు
ఏటీఎం లు,నెట్ బ్యాంకింగ్ ల్లో డబ్బులు మాయం

ఎవరికీ అనుమానం రాకుండా నేరాలు ఘోరాలు
బుద్ధి,సంస్కారం లేని చదువుతో కపట ప్రేమ లు
జీవితానికి పనికిరాని ఆటలతో నరకం చూస్తూ
ఊపిరాడక అనవసరంగా ప్రాణాలు కోల్పోతూ

కామెంట్‌లు