వెలుగు కురియు దారిలోన
కనులు మురిసె కలయచూసి
మౌనం మాటాడినట్టూ
కలకు రూపం వచ్చినట్టూ
సంతోషం వర్షమై కురిసినట్టు
దుఃఖం ఉప్పులా కరిగినట్టూ
ముళ్ళన్నీ పూలైపోయినట్టు
మోళ్ళన్నీ చిన్ని చిగురులొచ్చినట్టూ
మబ్బులన్ని ముచ్చటగ
పలకరించినట్టూ
కిరణాలు మనసు గుమ్మాన
తోరణాలైనట్టు
అడుగుఅడుగుకూ దూరాలు
దగ్గరైనట్టు
క్షణక్షణమూ కణకణమూ
రోమాంచితమవుతున్నట్టూ
కనుచూపుమేరలో గమ్యం
అగుపించినట్లు
మనసు మురిసే మధురక్షణాలను
మోసుకొచ్చే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి