సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు; చంద్రకళ.దీకొండ--
మూడు పదముల పాదములు
ముచ్చటైన మూడు పాదములు
మకుటముతో అలరారు ప్రక్రియ 
చూడచక్కని తెలుగు సున్నితంబు!

సుతారముగ మలచిన భాషాప్రక్రియ
సునీత గారిచే సృజించబడె
వడివడిగా ప్రఖ్యాతి పొందె
చూడచక్కని తెలుగు సున్నితంబు!

సులభముగ విశదీకరించవచ్చు  విషయము
బాలలకైనను రచించుట సులభము
కవులెల్లరకు చక్కని అవకాశము
చూడచక్కని తెలుగు సున్నితంబు!

వివిధ అంశముల సమాహారము
వారానికి ఒక అంశము
వ్రాయువారికి కల్పించు వెసులుబాటు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ముందుమాటను విరచించిరి సహృదయిని
పొత్తమును వెలయించితి నేను
చిత్తము ఆనందము పొందగా
చూడచక్కని తెలుగు సున్నితంబు!

అందించిరి సున్నితం బిరుదును
అలదిరి సుధీతిలకము రచనలకు
పురస్కారములతోడ పులకింపజేసిరి హృదిని
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ద్వితీయ వార్షికోత్సవ శుభవేళ
అందుకొనుడి అభినందన మాలలివే
సున్నిత సుహృదయిని సునీతగారు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!!
*************


కామెంట్‌లు