సుమం;-సుమ కైకాల

 నేనొక సుమాన్ని ... సుకుమారాన్ని !
పరిమళమే రెక్కలైన పారిజాతాన్ని !
రక్షక రేకులనే వల్మీకంలో 
కాడ అనే ఒంటి కాలి మీద 
తపమొనరించే తపస్వినిని 
ఒక మొక్క గుండెల్లో పదిలంగా 
పొదివి పెంచిన పసిమొగ్గను 
ఒక మాలి రక్షించిన 
రంగు బుగ్గల పాపను !
పుప్పొడి పొడి అద్దుకున్న 
గారాల చిట్టితల్లిని !
ప్రభువు సేవకై నాకు నేనుగా 
ముడి కట్టుకున్న ముడుపుని !
ఆ గోవిందుడి పాదాల చెంత 
ఒక్క ఘడియ పరిమళించి 
తనువు చలించినా చాలు !!!
కామెంట్‌లు