సమయస్ఫూర్తి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు టీచర్ ఓకథ చెప్పింది.హరి చాలా అందంగా  ఓచిత్రం గీస్తూ చెట్లకింద కూచున్నాడు.ఇంకో చెట్టుకింద రోహిత్ కూచుని మట్టి తో బొమ్మలు చేస్తున్నాడు.హఠాత్తుగా తలెత్తిన రోహిత్ కి  హరివెనకాల ఓపాము చరచరా పాకుతూ కన్పించింది. పెద్దగా అరిస్తే  భయపడి వెనక్కి తిరిగి  దడుచుకుంటాడేమో?అందుకే  ఓపెద్ద మట్టి గడ్డని తీసుకుని  హరివీపుకి తగిలేలా విసిరాడు."అబ్బా " అంటూ తలెత్తిన హరి తన భుజంపై ఉన్న  పెద్ద కండువాని పాము తలపై విసిరి  అక్కడనించి లేచాడు.ఇద్దరు  తమ సరంజామాతో పరుగులు పెట్టారు. వర్షాలు వరదలకి రకరకాల పాములు కొట్టుకుని వస్తాయి. పరిసరాలు చూసుకుంటూ జాగ్రత్తగా నడవాలి".టీచర్ కథ ముగించిందో లేదో క్లాస్ లో శివా ముక్కు లోంచి రక్తం కారుతూ వాడి చొక్కా అంతా  తడిసిపోయింది. టీచర్ గబగబా  వాడిని బెంచీపై తల బాగా  కిందకి వేలాడేలా ఉంచి తడిగుడ్డ ముక్కు పై పెట్టింది.ఆయా దగ్గర ఉన్న ఇంట్లోనించి  ఐస్ గడ్డ ఉల్లిగడ్డ తెచ్చింది.ఉల్లిపాయ ముక్కల్ని శివా ముక్కు దగ్గర పెట్టి వాసన పీల్చమని టీచర్ చెప్పటం కాసేపట్లో శివా  మామూలుగా అవటం జరిగింది. సమయస్ఫూర్తి తో  ఖంగారు పడకుండా టీచర్ చేసిన ఉపచారం చూసి పిల్లల కళ్ళలో ఆనందం ఆరాధప తొంగిచూశాయి🌹
కామెంట్‌లు