స్ఫూర్తి దాత! అచ్యుతుని రాజ్యశ్రీ

తెలుగు టీచర్ పాఠం చెప్తోంది. ఆపై తను చెప్పిన  దానిపై  ప్రశ్నలు వేస్తే ఒక్క  జయ తప్ప ఎవరూ జవాబు చెప్పలేదు. "మీరు పుస్తకం చేతిలో పట్టు కుని మస్తకంని ఎక్కడ పెట్టారు?" ఆపదం అర్ధంకాక జయవెంటనే అడిగింది "టీచర్!మస్తకం అంటే ఏంటి?" "చూశారా!వెంటనే అడుగుతుంది జయ తనకి అర్ధం కానిది! మీరు ఎందుకు అడగరు?..బుర్ర  మైండ్ మస్తకం అంటే"అని టీచర్ ఇంకో ప్రశ్న అడిగారు"ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దారనేర్పించినన్"అంటే అర్ధం?" "ఆడపిల్ల  మహిళ కి ఏవిద్య నేర్పినా ఎంచక్కా నేర్చుకుంటారు అని  అర్థం. మాఅమ్మ చెప్పింది"జయ జవాబు కి క్లాస్ అంతా చప్పట్లతో మార్మోగింది ."అవును. ఆడపిల్లలు వ్యవసాయం మొదలు అంతరిక్షంలోకి దూసుకుని వెళ్లారు. వాలెంటీనా తెరెష్కోవా తొలి వనితా వ్యోమగామి! ఇప్పుడు సీమాపాటిల్ అనే డాక్టర్  ఎడ్లపందాల పోటీల్లో పాల్గొని కొన్ని సార్లు ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిన  దేశంలోనే తొలి మహిళ " "ఆ!నిజంగానా టీచర్! మగవారు కదా పాల్గొనేది?" 
టీచర్ చెప్పసాగింది "కరెక్ట్! కానీ ఇప్పుడు ఆడమగ తేడాలేదు. మగదుస్తులు ధరించి కొన్ని సంస్థల్లో పనిచేస్తున్నారు.ప్యాంట్ షర్ట్ సాధారణం ఐంది.మహారాష్ట్ర కి చెందిన సీమాపాటిల్ తన12వ ఏటనించే ఎద్దులపై మమకారం పెంచుకుంది.ఆమె దగ్గర జీవన్ పవన్ అనే రెండు ఎద్దులున్నాయి.మధ్యప్రదేశ్ గుజరాత్  ఛత్తీస్గఢ్ లో జరిగే ఎడ్లపందాలలో పాల్గొంటుంది.ఎన్నో వందల పోటీల్లో పాల్గొన్నదామె!మహారాష్ట్ర లో ప్రతి ఏడూ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి లో ఎడ్లపందాలు జరుగుతాయి.తన పొలాన్ని స్వయంగా దున్నుతుంది.సాయంత్రం పల్లె ప్రజలకి వైద్యం అందిస్తుంది. " టీచర్ ఆఖరుగా అన్న మాట ఇదే"ఇప్పుడు అర్ధం ఐందా నాప్రశ్న! మీరు కూడా రోజూ పేపర్ చదివి ఇలాంటి విషయాలు శనివారం నాకు చెప్పాలి". బెల్ మోగటంతో ధన్యవాదములు టీచర్  అంటూ పిల్లలు లేచి నిలబడ్డారు🌹
కామెంట్‌లు