సుప్రభాత కవిత ; బృంద
కమ్ముకున్న చీకటికి
కంగారు పరుగులు

చీకటికి బెదిరేనా
వెలుతురు  బాణం

తూరుపు దిక్కంత
బంగారు వెలుగులు

కిరణాల పలకరింపు
గగనాల పులకరింపు

మృదువైన వెచ్చదనం
పరచుకున్న అనుగ్రహం

మనసులోని  తలపులు
చివురిస్తున్న ఆశలు

కోరుకున్న తీరాలు
చేరువయే దారులు

నీలాటిరేవులాటి
నింగి కొలనులో
విరిసిన వెలుగుల
సువర్ణ పుష్పం

కోటి ఆశల మూటను
తెచ్చే  శుభ ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు