పిల్లల కి పెద్దలకి రకరకాల ఆలోచనలు ఉంటాయి. పెద్దలు సంసారం ఆర్ధిక బాధలు పిల్లల భవిష్యత్తు గూర్చి ఆలోచిస్తారు.పిల్లలు చదువు ఆటపాటలు మార్కులు గూర్చి తంటాలు పడతారు.
ఆరోజు టీచర్ రాలేదు.ఇంకో టీచర్ వచ్చింది.పెద్ద క్లాస్ లకి వెళ్లే ఆమె కి ఏంచేయాలో తోచలేదు.అందుకే కాసేపు జి.కె.ప్రశ్నలు అడిగింది.
: హఠాత్తుగా టీచర్ అడిగిన ప్రశ్నకు పిల్లలు ఉలిక్కి పడ్డారు."మీభవిష్యత్తు గూర్చి చెప్పండి " "అంటే?" ఐదోక్లాసు పిల్లలకు అర్ధంకాలేదు."మీరు పెద్దయ్యాక ఏం అవుదామని అనుకుంటున్నారు?" అంతా డాక్టర్ సాఫ్ట్వేర్ ఫారిన్లో జాబ్ అని చెప్తోంటే టీచర్ కి ఆశ్చర్యం వేసింది. ఒక్క రు కూడా టీచర్ అవుతాం అని చెప్పలేదు. టీచర్ అడిగింది "మీలో ఎవరూకూడా బడిలో పనిచేస్తామని సైనికుడు పోలీస్ అవుతామని ఎందుకు చెప్పలేదు?" అబ్బో!రకరకాల జవాబులిచ్చారు."ఈరోజుల్లో ప్రైవేట్ బడిలో పని ఎక్కువ జీతం తక్కువ. తుమ్మితే ఊడేముక్కు!6పీరియడ్స్ గొంతు చించుకు అరవాలి" అని అంటుంది మాఅమ్మ..టీచర్ "గడుసు గణేష్ అన్నాడు. "మానాన్న పోలీసు! పండగ పబ్బం లేదు.
ఎప్పుడు ఎక్కడ అల్లర్లు జరుగుతాయో తెలీదు. గణేష నిమజ్జనం రోజు రెస్టు ఉండదు మాఅమ్మ నాన్నలకి! ఇద్దరూ పోలీసులు మరి"బాధ గా హరి అన్నాడు. అప్పుడు టీచర్ ఇలా ఇద్దరు వ్యక్తుల్నిగూర్చి చెప్పింది."ముంబైపోలీసు రెహనా షేక్ ని అంతా మదర్ థెరిసా అని పిలుస్తారు.50మంది పిల్లలను సొంతఖర్చుతో చదివిస్తోంది.పండుగలు పుట్టి న రోజుల్లో బీదలకి వారికి కావల్సినవి కొని ఇస్తుంది. 2000లోకానిస్టేబుల్ పోలీసుఫోర్సు లో చేరిన ఆమె ఆటల్లో మేటి.2017లో ఎథ్లెట్స్ లో బంగారు పతకం అందుకుంది.ఆమె భర్త కూడా పోలీసు శాఖవాడే"
"టీచర్!నేను పేపర్ లో ఓవార్త చదివాను " రోహిత్ ఉత్సాహంగా అన్నాడు "గొప్ప వారింట్లో పుట్టినంతమాత్రాన గొప్ప అనుకోరాదు షామీనాఅత్తర్ వాలా బాల్యం లో ముంబై లో బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గల్లీ లో పూరిగుడిసెలో ఉండేది. 15ఏళ్ళ కే ఆడపిల్లల సమస్యలు తెలుసుకుంది.కష్టపడి చదివి నేడు మైక్రో సాఫ్ట్ మేనేజర్ గా ముంబైలో ఓపెద్ద అపార్ట్మెంట్ లోఉంటోంది.కష్టపడి కృషి చేస్తే మీరు టీచర్ గా పోలీసు గా మంచి పేరు సంపాదించుకుంటారు.డబ్బు తో పేరు ఖ్యాతి రావు.చేసే మంచిపనుల వల్ల వస్తాయి ". ఇంత లో ఇంటిబెల్ మోగింది.ఆటీచర్ మాటలు బాగా బుర్రలోకి ఎక్కాయి."టీచర్!రోజూ మాక్లాస్ కి రండి ప్లీజ్ " ఆపిల్లల ప్రేమకి అలాగే అంటూ బైటపడింది 🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి