క్లాస్ లో పిల్లలంతా గోల గోల గా అరుస్తున్నారు.అస్సలు చదవని మొండి పిల్లాడు శివాని లీడర్ గా పెట్టారు టీచర్లంతాకల్సి! కనీసం ఇప్పుడు ఐనా లీడర్ కాబట్టి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాడని వారి ఉద్దేశం!కానీ వారి అంచనాలు తలక్రిందులైనాయి.అల్లరి పిల్లలంతా శివాకి సైసై అని తందానతాన అని సపోర్ట్ చేస్తూ చదివే మంచి పిల్లలపై జులుంచేయసాగారు.ఇప్పుడు ఐదుగురు అల్లరి భరించలేక వారి జులుం సహించలేని టీచర్లు ఓ కొత్త రూల్ పెట్టారు. వారానికి ఓ అల్లరి పిల్లాడు లీడర్ గా ఉండాలి. ఎక్కువ మార్కులు తెచ్చుకునే మంచి బుద్ధి మంతుడైన విద్యార్ధి మాట ఆలీడర్ విని తీరాలి. లేకుంటే వాడికి మైనస్ పాయింట్లు! ఆరోజు తెలుగు టీచర్ ఓకథ చెప్పసాగింది " మృగరాజు సింహంకి కాస్త ముసలితనం వచ్చింది.అందుకే రెండు నక్కలు దాని దగ్గర చేరాయి.అయ్యా!మీకు కావల్సిన చిన్న జంతువులను ఆహారం గా అందిస్తాం.అందులో కొంతభాగం మాకు వదలాలి అని షరతు పెట్టాయి.సింహం పెద్దగా నవ్వుతూ..'పిచ్చి వెధవల్లారా! నాఇద్దరు పిల్లలు సోంబేరుల్లా గుహలో ఉన్నాయి.వాటికి బుద్ధి చెప్పాలనే నేను శక్తి లేని దానిలా నటిస్తున్నాను. చిన్న జంతువులు నాపంటికిందకి కూడా రావు.అనవసరంగా వాటిని చంపేబదులు మిమ్మల్ని చంపితింటే నాకు ఓపూట పొట్ట నిండుతుంది. 'అంతే బతికుంటే బలుసాకు అని నక్కలు అక్కడ నించి ఉడాయించాయి.దీనివల్ల మీకు ఏంతెల్సింది?"
తెలివిగల రోహిత్ అన్నాడు "టీచర్!ఎప్పుడూ మన బుర్ర మన శక్తి సామర్ధ్యాలమీద ఆధారపడాలి.ఈసింహం చచ్చాక ఇంకోటి వస్తుంది. ఆరెండు నక్కలు జీహుజూర్ అంటూ సింహం కి సలాంకొట్టే బదులు తమకన్నా బలహీనంగాఉన్న జంతువులను ప్రేమగా చూస్తూ వాటి ఆదరణ ప్రేమను పొందాలి.నక్కలు లీడర్ గా మారుతాయి.లీడర్ అంటే రక్షించు వాడు దారి చూపేవాడు."అంతే అల్లరి పిల్లల నోళ్లు మూతబడ్డాయి."రోహిత్! మా అల్లరి గ్యాంగ్ కి నీవే లీడర్ వి! మాకు మార్గదర్శివి"అన్న వారితో సరే అన్నాడు. ఇప్పుడు ఆఅల్లరి పిల్లలు బాగా చదువుతూ అందరి మెప్పు పొందుతున్నారు. 🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి