గుండెలో సందడి
నింగిలో సంబరమైనది
వెన్నెలలో మెరుపులన్ని
చూపులో వెలుగులైనవి
హృదయంలో అలజడిలా
ఉదయం హడావిడి మొదలైంది
కరుగుతున్న నిరీక్షణ స్థానే
పెరుగుతున్న ఆనందం
కోతకెదిగిన పంటలా
కోరికలెగసెను మింట
అట్టడుగున దాచిన నవ్వులన్ని
బట్టబయలవుతున్నట్టు
బెట్టు చేసిన మురిపాలు
ముంగిట నాట్యమాడినట్టు
మురిపించే ముచ్చట్లు
ముంగిట కురిపించే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి