పిల్లలూ.... !
మీరు చక్కగ చదువులు చదవా లన్నా....
గొప్పవారిగా ఎదగాలన్నా ...
సుఖ, సంతోషాలతో ...
ఆనందంగా బ్రతకాలన్నా...
మొదట ఆరోగ్యంగాఉండాలి !
ఆరోగ్యమే మహాభాగ్యమని...
అన్నారందుకే పెద్దలు !!
మనం ఆరోగ్యంతో ఉండాలంటే
పరిశుభ్రత పాటించాలి !
ప్రతిదినమూ వేళకు లేచి...
కాలకృత్యములు తీర్చుకుని
చక్కగ స్నానము చేయాలి...
ఉతికినబట్టలు కట్టాలి !
స్కూలు బేగులు, పుస్తకము లను పరిశుభ్రంగా ఉంచాలి, వేళకు బడికి వెళ్ళాలి, క్రమశిక్షణతో మెలగాలి !
వీధిలో... ఈగలు వాలినవి..
కుళ్ళినపళ్ళు, పాచినచిరు తిళ్ళు.... అస్సలు తిననే తిన కూడదు !
వాంతులు, విరేచనాలతో...
అవి మనఆరోగ్యానికి కీడును
చేస్తాయి !
అది స్కూలైనా, పార్కైనా...
ఇంటినుండి బయట కెక్కడికి వెళ్లి,వచ్చినా...కాళ్ళూ,చేతులు
ఒళ్ళంతా సబ్బు,నీళ్లతో చక్కగా
శుభ్రం చేసుకోకపోతే....
గజ్జి, తామరవంటివి ఎన్నో
జబ్బులు వస్తాయి ! ఎంతో చీకాకును కలిగిస్తాయి !
మనముశుభ్రంగాఉంటేచాలదు
మనఇల్లూ, పరిసరాలూ....
పరి శుభ్రంగా ఉండాలి !
ఎక్కడపడితే అక్కడ... చెత్తను వేసి,మురుగునీరుపారక,నిలవ
ఉండి పొతే....దోమలు పెరిగి...
రక - రకాలజ్వరాలతోజబ్బులు చేసి,ప్రాణాలకే ముప్పురావచ్చు
మన మారోగ్యంగా ఉన్నపుడే
బుద్ది బాగా వికసించి, చక్కగ చదువులు చదవ గలం... !
గొప్పవారిగా ఎదగగలం... !!
సుఖ, సంతోషాలతో...
ఆనందంగా బ్రతక గలం !!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి