పూలు పిలిచాయి;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పూలు పిలిచాయి
పరవశించా
తోటలోనికి
ప్రవేశించా

మల్లె సిగ్గుపడింది
ముచ్చటపడ్డా
పరిమళం చల్లింది
ఆఘ్రానించా

గులాబి రమ్మంది
చెంతకువెళ్ళా
గుసగుసలాడీంది
సంతసపడ్డా

మందారం ఆహ్వానించింది
ధన్యవాదాలుచెప్పా
మత్తెక్కించింది
మనసుపడ్డా

చామంతి చూచింది
సోయగాలుచూచా
సరసాలాడింది
సంబరపడ్డా

బంతి బహుబాగున్నది
చేతిలోనికితీసుకున్నా
పులకరించిపోయింది
మెల్లగానిమిరా

కనకాంబరం కులికింది
కుతూహలపడ్డా
అందాలు ఆరబోసింది
ఆనందపడ్డా

సన్నజాజి స్వాగతించింది
సమీపానికివెళ్ళా
సుగంధంచల్లింది
ధన్యవాదాలుచెప్పా

సంపంగి సమీపానికొచ్చింది
చేతిలోకి తీసుకున్నా
సువాసనలుచిందింది
సంతోషంలోమునిగిపోయా

పూలప్రేమకు
పొంగిపోయా
పూవులపైన
కవితవ్రాశా


కామెంట్‌లు