నవ్వు. (కవిత );-టి. వి. యెల్. గాయత్రి.పూణే.
నవ్వలేవు మనసార పశుపక్ష్యాదులు
నవ్వ లేవు భువిని క్రిమి కీటకాదులు
ధరణిలో నవ్వును మనిషి కిచ్చెను దైవము
నవ్వ వోయి నరుడ! నాలుగు కాలాలు.

దానమీయగ లేము ధన ధాన్య రాశులు
దోచి పెట్టుగలేము తోటలు  భవనాలు.
విలువ నిడుచు వెంట చరించగ జనులు 
మంచి నవ్వుల రతనాలు
పంచి చూడుమ!నరుడ!
---------------------------


కామెంట్‌లు