కోతలరాయుళ్లు!(ఓ జర్మన్ కథ ఆధారంగా)అచ్యుతుని రాజ్యశ్రీ

 జార్జి జెరో అనే ఇద్దరు మిత్రులు  ఓసత్రంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్నారు.అక్కడ ఓమురికి దుమ్ము పట్టిన గాజుతొట్టెను చూస్తారు. అందులో ఓ అపూర్వమైన చేప ఉంది. అక్కడ ఓతాత దాని చరిత్రను ఇలాచెప్పాడు"ఆగాజు తొట్టిలోని చేపను నేను 16ఏళ్ల క్రితం నేను పట్టుకున్నాను.అప్పుడు దాని బరువు 18 పౌన్లు."అలా గొప్పలు చెప్పి అతను వెళ్లి పోయాడు.ఇంతలో ఇంకో వ్యక్తి అక్కడ వారితో కబుర్లు చెబుతూ "మీరు ఇక్కడికి కొత్త గావచ్చారా?"అని కాసేపు  ఆకబురు ఈకబురు చెప్పి "ఆతొట్టెలోని చేపను చూశారా? దాన్ని నేనే పట్టుకున్నాను. అప్పుడు దాని బరువు  26పౌన్లు.5ఏళ్ల క్రితం వలవేసి పట్టుకున్నాను. "అతని మాటల సొరకాయకు ఇద్దరు మిత్రులు బోల్తా పడి నోరు తెరుచుకుని ఉన్నారు. తను ఎంతకష్టపడ్డాడో వివరించి ఎంచక్కా  తన దోవన తాను పోయాడు. ఇంతలో ఓమధ్య వయసు వ్యక్తి వచ్చి నిశబ్దం గా కూచుని  ఆగాజు తొట్టి వైపు చూస్తూ ఉంటే జార్జి అడిగాడు " ఆచేపనుగూర్చి మీకేమైనా తెలుసా? మీరెలా దాన్ని పట్టుకున్నారు?" అంతే అతను  ఏకధాటిగా చెప్పుకుంటూ పోయాడు " దాన్ని నేను  కేవలం ఓ అరగంట లో పట్టుకున్నాను. దాని బరువు 30పౌన్లు ". అతను కూడా వెళ్లాక ఓభూస్వామి వచ్చాడు. " ఏంపిల్లలూ? మీతో మాట్లాడిన వారంతా బాగా సొరకాయలు కోశారా? నేను పదేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు  దాన్ని పట్టుకోటానికై స్కూల్ డుమ్మా కొట్టాను."అని చాలా సేపు సుత్తికొట్టి కదిలాడు. 
జార్జి కి ఆగాజుతొట్టెలోని చేపను చూడాలనిపిస్తుంది. ఓకుర్చీ ఎక్కి దాన్ని దగ్గర మొహం పెట్టి పరిశీలనగా చూడసాగాడు.  ఆకుర్చీ కాస్త సర్ న జరగడం తో ఆధారం కోసం  ఆగాజు తొట్టిని పట్టు కున్నాడు.అది కాస్త ఠాప్ మని నేలపై బడి  భళ్ళు మని బద్దలు ఐంది. ఆచేప నేలగచ్చుపై పడి ముక్కలు చెక్కలైంది.ఆఇద్దరు మిత్రులు బిత్తరపోయారు.ఇంతకీ అది నిజమైన చేపకాదు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన చేప బొమ్మ!🌹
కామెంట్‌లు