శ్రావణ సందడి;-డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్
శ్రావణ మాసం అతివలు మెచ్చే మాసం
శ్రావణ మాసం సిరులు తెచ్చిచ్చే మాసం
శ్రావణ మాసం వాయినాలు ఇచ్చే మాసం
శ్రావణ మాసం లక్ష్మీదేవి నీ కొలిచే మాసం

వాకిళ్లకు మామిడి తోరణాలు కట్టి
ఇళ్ళ ముందు రంగవల్లులు చక్కగా దిద్ది
పొద్దున్నే ముచ్చటగా తలంట్లు పోసుకుని
చేతులకు  అందంగాగోరింటాకు లు పెట్టుకుని

వరలక్ష్మి అమ్మవారిని ఇంట్లో ప్రతిష్టించుకుని
మంగళ కరమైన పసుపు కుంకుమ లను రాసుకుని
జ్ఞాన వెలుగుల దివ్వెలను వెలిగించుకుని
పూలు పండ్లు తెచ్చుకునిముచ్చటగా అలంకరించి

ముత్తైదువులను పేరంటానికి పిలిచి పీట వేసి
కాళ్లకు పసుపు పూసి నుదుటన బొట్టు పెట్టీ
తాంబూలం,శనగలు తో వాయినమే ఇచ్చి
పెద్దవారి కాళ్లకు నమస్కారం చేసి ఆశీస్సులు
అందుకొనుటయే వరలక్ష్మి వ్రతం కళకళ లు 

కామెంట్‌లు