" సమాజహితేన సాహిత్యం ";-కోరాడ నరసింహా రావు !
 అనేదానికి పూర్తిగా న్యాయాన్ని చేకూరుస్తూ...కొనసాగిన ఆధు నిక తెలుగుసాహిత్యాన్ని సమా జానికంకితం చేసినవారిలో... 
కందుకూరి"తాత"ఐతే,గురజాడ" తండ్రి, " శ్రీశ్రీ "సహోదరుడై 
మనకు వారసత్వ సంపదలా అందించారనే చెప్పాలి !
అటు కందుకూరికి, ఇటు శ్రీశ్రీ కి 
బలమైన వారధి, ప్రజాచైతన్య సాహిత్య సారధి గురజాడే.. !
ప్రధానంగా ఈ ముగ్గురిప్రభావం తోవస్తు, విధాన, భావజాలంతో 
ముప్పేటల అల్లికలాంటి గొప్ప సాహిత్యం ఓ జీవనదిలా సమా జంలో  ప్రవహిస్తోంది !
 " దిద్దుబాటు "కథలోనైనా... 
  " కన్యాశుల్కం "నాటకంలో నైనా...దేశభక్తి గేయాల్లోనైనా 
మొత్తం సాహిత్యమంతా.... 
 అపసవ్య సామాజిక పరిస్థితు లకు పడ్డ ఆవేదనే...! మార్పుకో సంపడేతపనే...,అణువణువునా దేశభక్తిని రగిలించే ప్రయత్న మే....!
"దేశ మంటే మట్టికాదోయ్,దేశ మంటే మనుషులోయ్'అంటూ 
సాటి మనుషుల్ని ప్రేమించి గౌర వించటమే..దేశాన్నిప్రేమించటం
గౌరవించటమంటే, అనే  గొప్ప సత్యాన్ని ఎలుగెత్తి చాటుతూ మొదలైన ఈ గేయం... పాడి, పంటలు... శక్తి సామర్ధ్యాలు అత్యావశ్యకమని... కులాలు, మతాలు, ఎల్లలు, విబేధాలన్నీ మరచి ఏక కుటుంబంలా బ్రత కాలని,వసుధైకకుటుంబంకావా  లని కాంక్షిస్తూ ఈ మానవప్రపం చానికిహితోపదేసంచేసినమహా మానవతావాది గురజాడ !   
జగమెరిగినబ్రాహ్మణునికిజంధ్య మేలఅన్నట్టుఇప్పుడుప్రత్యేకించి నాలాంటివాడు గురజాడ గొప్పతనాన్ని ప్రశంసించే ప్రయ త్నం చేసినా... ఆ సూర్యుని చూపటానికి దివిటీని పెట్టటమే ఔతుంది !
గురజాడ సాహిత్యాన్ని చదవని చదువరి ఈ సాహితీ సమాజం లోఇంకా ఉన్నారని నేననుకోను
 తెలుగు భాష... కందుకూరి. గురజాడ, శ్రీశ్రీ సాహిత్యాలు... 
అప్పటికీ,ఇప్పటికీ మరెప్పటికీ 
అజరామరాలు !
సాహితీ వేత్తల నాల్కలపై నాట్యమాడుతూనే ఉంటాయి !
ఆత్రిమూర్తుల స్పూర్తితో ఆధు నిక కలాల నాగళ్లు సామాజిక చైతన్య అక్షరబీజాలను నాటు తూనే ఉంటాయి !
బలమైన ఫలసాయాన్నిచ్చే 
సాహితీ సేద్యం కొనసాగుతూనే ఉంటుంది !
 జై తెలుగు సాహిత్యం !
  జై జై తెలువు పాఠక ప్రపంచం 
    *******

కామెంట్‌లు