సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 గుణం... ఆభరణం
   *****
 వ్యక్తి యొక్క ప్రవృత్తి, వ్యవహరించే తీరును, సానుకూల వైఖరినే గుణం అంటారు.
 ప్రతి వ్యక్తిలో తనవైన ప్రత్యేక లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆయా సమయాల్లో,ఇతరులతో వ్యవహరించే తీరును బట్టి  గుణాన్ని అంచనా వేయడం జరుగుతుంది.
ఈ గుణాల సముదాయమే వ్యక్తి ఉన్నతత్వం,సామాన్యత్వం,అధమత్వంలో ఏ కోవకు చెందిన వాడో స్పష్ట పరుస్తుంది.
కాబట్టి గుణమనేది వ్యక్తికి విలువైన ఆభరణమై శోభించాలి.అది సుగుణమై మానవీయ విలువల పరిమళాలు వెదజల్లాలి.
ఆ విధంగా సుగుణాభరణ భూషితుడైన వ్యక్తి గౌరవ మర్యాదలు అందుకోగలడు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు