కుక్కపిల్ల ; డాక్టర్ . గౌరవరాజు సతీష్ కుమార్
కుక్కపిల్లా రావే పిల్లా
పిలిచిన వెంటనే
చకచక పరుగుతొ
రావే పిల్లా!

పిల్లలవెంట
గబగబ నడకతొ
తోకాడిస్తూ రావే పిల్లా!

కిలకిల పాపలు
రమ్మనగానే
బిరబిర తిరుగుతు
రావే పిల్లా!

జిలిబిలి పలుకుల
పిల్లలతోను
మిసమిస రంగుల
పూవులు విరిసిన
నవనవ తోటకు
రావే పిల్లా!

గలగల గాజుల
మా చిట్టి పాప

వలవల ఏడుపు
ఏడుస్తుంటే
కరకర మురుకులు
పట్టుకు చేత
కిరకిర తలుపు
తోసిన పిల్లా
సరసర రావే
ఓ కుక్క పిల్లా !!
*********************************
కామెంట్‌లు