తెలంగాణా భాషా దినోత్సవ శుభాకాంక్షలతో
================================
శత్రువా.. శ్రేయోభిలాషా...?
*****
ఈర్ష్యా అసూయల వల్లనో,మాటా మాటా విభేదం వచ్చో.. మరే ఇతర కారణాల వల్లనో, కొందరు కొందరికి శత్రువులుగా మారుతుంటారు.
ఒక్క సారి ఇద్దరి మధ్య శత్రుత్వం పొడసూపింది అంటే ఇక ఒకరి మీద ఒకరికి నిఘా పెరుగుతుంది.
ఏమాత్రం తేడా వచ్చినా విమర్శనా ఆయుధాలు పట్టుకుని దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు.
అలాంటి శత్రువే మనకు శ్రేయోభిలాషనీ ,ఆ వ్యక్తి వల్ల కొన్ని లాభాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా!. కానీ ఇది నిజం.
ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూ చేసే పనుల్లో తప్పుల్ని వెదకడానికి, దానిని గోరంతలు కొండంతలు చేసి ఇతరుల ముందు పెట్టడానికి శత్రువులు తపిస్తూ ఉంటారు.
అలాంటి వారే మన శ్రేయోభిలాషులు.వారి గురించి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు.
ఎందుకంటే వాళ్ళకు తెలియకుండానే మన హితైషులుగా మారారని అర్థం చేసుకోవాలి.మన లోని లోపాలను ఎత్తి చూపి సరిదిద్దే గొప్ప కార్యాన్ని భుజాన వేసుకున్నారని భావించాలి.
అలా మనలోని మరింత పట్టుదలకు, కృషికి, ధైర్య సాహసాలకు పదును పెట్టుకునేలా ,మనమేంటో సమాజానికి తెలిసేలా చేసే శత్రువును ఎల్లప్పుడూ శ్రేయోభిలాషిగానే భావిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి