జాతీయ బాలికల దినోత్సవ
సందర్భంగా... నాకుమార్తెలకు
అంకితమిస్తూ....... !
===================
ప్రేమ, ఆప్యాయతలతో...
అభిమానించే ఆడపిల్లలు
అబ్బాయిలకేమాత్రమూ
తీసిపోరు !
ఆదరించనికొడుకుల కంటే...
అభిమానించే కూతుళ్ళున్న
తల్లిదండ్రులదే అదృష్టమంటే
కొడుకులు లేని నాలాంటి...
తల్లిదండ్రులకేమికొదవ !
ముగ్గురూ కూతుళ్లయితేనేం
ప్రేమాభిమానాలు చూపించటంలో,ఆప్యాయతానురాగాలు పంచటంలో.,ఎవరి కి ఎవరూ తీసిపోరు !
కొడుకు పుట్టలేదని...
బాధపడేవాడ్ని... !
అమితంగా ఆదరిస్తున్న
కూతుళ్లను చూసి...
గర్వపడుతున్నాను !
ఉద్యోగాలు లేకపోయినా...
చక్కగా ఇద్దరు డిగ్రీలు పూర్తి చేస్తే... ఆఖరుది డబల్ m.A.
B.Ed.చెయ్యటం నాకు గర్వకారణమే కదూ... !
ఆదిశక్తిలాంటి భార్య....
లక్ష్మి,సరస్వతి,పార్వతి లాంటి
కుమార్తెలు సోని,వాణి,తోరనీ లు.... !
నా అదృష్టమే కదా అదృష్టం
కొడుకులున్నా... నాకన్నాభాగ్య
వంతు డెవరీ లోకంలో.... !?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి