తెలుగు భాషా దినోత్సవం;- -రూప
 "ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె."- అని ఎలుగెత్తి చాటిన వాడు,
తెలంగాణా ప్రజల ప్రతీ ఉద్యమపు ప్రతిధ్వని, తెలంగాణ జీవిత చలనశీలి, బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు,
 పద్మవిభూషణ్ , ప్రజాకవి కాళోజీ  జన్మదినమైన సెప్టెంబర్ 9 ని తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ భాషా దినోత్సవం'గా చేసి గౌరవించింది.
ఆ రోజున తెలంగాణ రాజధాని హైదరాబాదు తోపాటు రాష్ట్రవ్యాప్తంగా భాషా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన, ఉపన్యాస, కవితా పోటీలు నిర్వహిస్తారు. భాషా, సాహిత్యరంగంలో విశేషకృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
   ఈ సందర్భంగానైనా ఆ మహనీయుని  తెలుసుకోవడం, చర్చించుకోవడం వారి వారసులుగా మనందరి అవసరం.
      
                    

కామెంట్‌లు