స్వతంత్ర భారతం ;- S. రత్నలక్ష్మి;-సెల్:: 8331930635
 భరతమాతకు దాస్యశృంఖలాలు తగిలించి
భారతీయులందరినీ బానిసలుగా తలంచి
భారతదేశాన్ని దోచుకున్నారు పరిపాలించి
చూడచక్కని తెలుగు సున్నితంబు
  
బ్రిటిష్వారి అమానుష అరాచకత్వం
భారతీయులలో పెల్లుబికిన పోరాటతత్వం 
సమైక్యమైరి  భిన్నత్వంలో  ఏకత్వం 
చూడచక్కని తెలుగు సున్నితంబు
  
ఆంగ్లేయులపై అల్లూరి ఆగ్రహం 
సత్యాగ్రహంతో గాంధీగారి నిగ్రహం
స్వాతంత్ర్యానికై పోరాడగా అహరహం  
చూడచక్కని తెలుగు సున్నితంబు
  
చేయగా దండియాత్రతో సత్యాగ్రహం  
ఆచరించగా సహాయ నిరాకరణోద్యమం 
గోబ్యాకన్న క్విట్ఇండియా నినాదం 
చూడచక్కని తెలుగు సున్నితంబు
  
హేరామ్... జై హింద్... వందేమాతరం
అంటూ ప్రాణత్యాగమొనరించిన సమరం 
తుట్టతుదకు సిద్ధించింది స్వాతంత్ర్యసంబరం 
చూడచక్కని  తెలుగు  సున్నితంబు

కామెంట్‌లు