నాటకాలు కానీ, సినిమాలు కానీ చూసి ఆనందిస్తారు ప్రతి ఒక్కరు. ఒక మాట అందంగా మాట్లాడితే ఎంత గొప్పగా చెప్పాడు అని కొనియాడుతాడు. అలాంటి బాపు గారి సినిమాలో ఆరుద్ర గారు 5 నిమిషాల పాట రాసిస్తే ప్రక్కనే ఉన్న శ్రీ రమణ 5 నిమిషాల్లో రాశారు 5000 చెక్కు తీసుకెలుతున్నారు అన్నారు. ఐదు నిమిషాలలో రాసిన విషయం గమనించావ్ కానీ బాపు చెప్పిన విషయాన్ని అవగాహన చేసుకుని దానిని వారికి నచ్చే లా రాయడానికి దాని వెనుక ఉన్న నా సామర్థ్యానికి ఎంత కృషి ఉన్నదో ఆలోచించావా? అలా నేను పడ్డ కష్టానికి ఫలితం జీవితంలోకి చిన్న విషయమైనా కానీ, వేదాంత పరంగా చెప్పవచ్చు అది వారి సొంతం. అలాగే శివ నాగి రెడ్డి గారు కార్యక్రమం చేయాలని ఆలోచిస్తే ఈ కార్యక్రమం ఎవరితో ఎలా చేయాలి ఒక చర్చా కార్యక్రమం తీసుకుంటే దీని గురించి మనం చర్చించాలన్న అంశాన్ని ఎలా నిర్ణయించుకోవాలి ఆ అంశాన్ని గురించి మాట్లాడగలిగిన వక్తలు ఎంతమంది ఉన్నారు మనకు ఎంత మంది కావాలి అని మొత్తం ఆలోచించి వారిని ఎంపిక చేస్తారు వచ్చిన వారందరికి ఒకే పద్ధతిలో మర్యాదలు జరుగుతాయి. అందువల్ల రెడ్డి గారు తీసుకున్న అంశం ఏదైనా ఆ విషయాన్ని ఎన్ని కోణాల్లో చెప్పవచ్చునో అన్ని కోణాలను ఆలోచించి ఒక్కొక్క కోణాన్ని గురించి ఒక్కొక్కరిని ప్రసంగించ వలసిందిగా కోరతారు. దానితో ప్రేక్షకుడు ఆనందిస్తాడు అన్ని కోణాల్లో ఉన్న సాధక బాధకాలను తెలుసు కుంటాడు. ఆ చర్చా కార్యక్రమం విజయవంతం అవుతుంది అదే విషయాన్ని గురించి గోష్ఠి ఏర్పాటు చేస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయం గురించి మాట్లాడమంటారు చర్చా కార్యక్రమంలో ఒకరు మాట్లాడిన తరువాత వారిని విమర్శించే అవకాశం రెండో వారికి ఉంటుంది కానీ గోష్ఠిలో ఆ అవకాశానికి తావు లేదు. అలాగే ఎవరైనా ఒక విషయంలో మంచి అనుభవం కలిగిన వారు ఉంటే వారిని పరిచయ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తారు. వారిని ప్రశ్నించే వారు ఎవరు? వారు దేనిని గురించి విశ్లేషించగలరో దానిని అర్థంచేసుకునే వారు కావాలి. దాని గురించి తెలిసిన వాడు కావాలి. అసందర్భంగా ప్రశ్నలడిగితే అసహ్యంగా ఉంటుంది ఆ వచ్చిన మేధావికి తల నొప్పిగా ఉంటుంది. ఇక ప్రేక్షకుల విషయం చెప్పనవసరమే లేదు కనుక మానసిక విశ్లేషణతో అవగాహన కలిగిన వ్యక్తిని ఎన్నుకొని వారితో ప్రశ్నలు అడిగిస్తే పోటాపోటీగా సమాధానాలు వస్తూ ఉంటే ఒకరిని మించి మరొకరు మరో మెట్టు పైకి ఎక్కుతూ ఉంటే వినే ప్రేక్షకుడు మనసు పెట్టి ఏకాగ్రతతో వినే అవకాశం వస్తుంది. అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో శివనాగిరెడ్డి సమర్ధుడు. ఎవరైనా వ్యక్తి కానీ బృందం గాని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ విషయాన్ని ముందే గమనించి వారిని సంప్రదించి వారు ఏర్పాటు చేసిన ముందు రోజు గానీ తరువాత రోజు కానీ తాను ఏర్పాటు చేసుకొని ఆ నాట్యాన్ని ఆస్వాదించగలిగిన వ్యక్తులను మాత్రమే ఆహ్వానించి అందరికీ ఆనందాన్ని కలిగించే మంచి మనిషి. కార్యక్రమం పూర్తయిన తరువాత వారిని అక్కడి నుంచి పంపడానికి డ్రైవర్ ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఆ కార్యక్రమ విశేషాలను వివరిస్తూ వారి గొప్పతనం తెలిసిన వారిని కూడా ముందే ఆహ్వానిస్తారు ఒక్క నిమిషం ముందు కాదు వెనక కాదు వారు చెప్పిన సమయానికి ఖచ్చితమైన సెకనుకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యక్రమం పూర్తి అయ్యే సమయాన్ని కూడా ముందే తెలియజేస్తారు. ఏ కార్యక్రమం చేసినా ప్రణాళికాబద్ధంగా లేకపోతే వారి కోసం కార్యక్రమం అయిపోయిన తర్వాత సమయాన్ని బట్టి అల్పాహారాలు ఆహారాలు ఏర్పాటు చేయడం కూడా వారికి తెలుసు. అందువల్ల ఎవరు ఏ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారో వారు ఎంతో ఆనందంతో వచ్చి చక్కటి ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకుల మన్ననలను పొందిన వారే ఆ సాంస్కృతిక రంగాల్లో అందె వేసిన చేయి శివనాగిరెడ్డిది.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (41);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి