ఉదయం ఆరు గంటలు.ఇమ్లీబన్ బస్టేషన్.కర్నాటక బస్...కండక్టర్ బయట నిలబడి, జహీరాబాద్...హుమ్నాబాద్.... గుల్బర్గా అని అరుస్తున్నాడు.కర్నాటక బస్సులకు,మన బస్సులకు చాలా తేడా ఉంటుంది,అంటే బస్సు షేప్ లో,సీటింగ్ లో.మేయిన్ డోర్ ఉంటే మొదట్లో,లేదంటే చివర్లో వుంటుంది.కూర్చునే సీట్లు కూడా ఇద్దరు మనుషులు కూర్చోలేని పరిస్థితి.టూ ప్లస్ త్రీ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది.వీటి మధ్యన నడవడానికి స్థలం కూడా చాలా ఇరుకుగావుంటుంది.పూర్వ అనుభవం మూలంగా నేను విండో సీట్ ని తాత్కాలికంగా స్వంతం చేసుకున్నాను.విండో సీట్ కాకుండా పక్క సీటులో కూర్చుంటే ప్రయాణమంతా నరకమే.ఆ అనుభవం జ్ఞాపకం వచ్చి నేను ఎప్పుడూ విండో సీట్ నే ఎంచుకుంటాను.బస్ బయలుదేరింది, గుల్బర్గా చేరేందుకు ఆరు గంటల సమయం పడుతుందని ముందే చెప్పారు డ్రైవర్ గారు.బస్,గౌలీగూడ నుంచి ప్రారంభమై అఫ్జల్ గంజ్, నాంపల్లి,లకడీకాపూల్,మాసబ్ ట్యాంక్,మెహదీపట్న టోలీచౌక్ మీదుగా లింగంపల్లి చేరుకునే సరికి గంటన్నర పట్టింది.వర్కింగ్ డే అవడం మూలంగానేమో, లింగంపల్లి చేరుకునే సరికి బస్సు పూర్తిగా నిండిపోయింది.పాసింజర్లు తమ లగేజ్ లను ఎక్కడ పెట్టుకోవాలో,తెలియక కూర్చున్న వాళ్ళ కాళ్ళ సందుల్లోనో,లేదంటే వాళ్ళ మీదనో,పెట్టేసి,సీటుకి,సీటుకి మధ్యలో ఉన్న ఆ కాస్త స్థలాన్ని కబ్జా చేసేసారు, దాంతో కూర్చున్న వాళ్ళకు కూడానరకమే.బస్సంతా ఫుల్ కావడంతో కొందరు మహిళలు డోర్ దగ్గర ఉన్న మెట్లపై నిలబడ్డారు.ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, గుల్బర్గా కు చెందిన ఒక పీడియాట్రిక్ సర్జన్,తన సర్టిఫికేట్లు పటాన్ చెరువులో నా కజిన్ వచ్చి మీకు ఇస్తాడు,అవి కలెక్ట్ చేసుకుని నాకు ఇవ్వండి అని చెప్పారు, దాంతో నేను ఇమ్లీబన్నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆ డాక్టర్ కజిన్ తోఫోన్లో టచ్ లో వున్నాను.ఆయనకు నేనెక్కిన బస్సు నెంబర్ ఇచ్చి, నేను బయలుదేరినప్పటి నుంచి స్టేజి,స్టేజీకి అప్ డేట్స్ ఇస్తూ వచ్చాను.తీరా చూస్తే లింగంపల్లి లోనే బస్ ఫుల్ అయ్యింది.ఫుట్ బోర్డు పై మహిళలు కూడా నిలబడడం ఆశ్చర్యం వేసింది.నేనుకూర్చున్న సీటు మేయిన్ డోర్ కి ఎంతో దూరం లేదు కానీ, నేను పసిఫిక్ మహాసముద్రాన్ని ఈదే ఒక ఈతగాడిలా,అందరినీ దాటుకుంటూ డోర్ దగ్గరకువెళ్ళాను.అక్కడ ఫుట్ బోర్డు మీద నిలబడ్డ ఒక మహిళను అడిగా, మేడం, మీరు ఇక్కడ నిలబడి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంది, ఇంకో బస్ లో రావచ్చు కదా అని.అంతే ఆమె తన గోడు వేళ్ళబోసుకుంది.ఆమె ఒక టీచర్,జహీరాబాద్ దగ్గరఒక చిన్న పల్లెటూరులో ఉద్యోగం.రోజూ లింగంపల్లి లో బస్ ఎక్కి జహీరాబాద్ లో దిగి అక్కడ తనకు తెలిసిన వాళ్ళింట్లో స్కూటీనీ, పెట్టుకొని,అక్కడి నుంచి ఆ ఊరికి వెళ్ళాడం గత కొన్నేళ్లుగా జరుగుతుంది.ఇది వినడానికిఈజీగా ఉండవచ్చు కానీ,ఆ టీచర్ గత కొన్నేళ్లుగా నానా ఇక్కట్లు పడుతూ, స్కూలుకి టైంకి చేరుకుంటుంది.ఆమె ఎంత కష్ట పడుతుందో అది అనుభవం లోకి వస్తే కానీ మనకు తెలియదు.ఆర్టీసీ సమ్మె తరువాత ఈ రూట్ లో తెలంగాణ రాష్ట్ర బస్సులు అస్సలు తిరగడం లేదు, అంటే లిమిటెడ్ గా తిరుగుతున్నాయనీ,ఇకగత్యంతరం లేక కర్నాటక బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అని ఆ టీచర్ చెప్పింది.నిజమే నేనూ ఇంబ్లీబన్ బస్టేషన్ మన బస్సుల గురించి అడిగినప్పుడు లేవనే చెప్పారు.
సమయానికి స్కూలు చేరాలంటే దొరికిన బస్ ఎక్కక తప్పదు.తీరా ఎక్కితే బస్ నిండిపోయి ఉంటుంది,తప్పదు ఫుట్ బోర్డే గతి అని ఆమె ముగించింది.ఆడవాళ్ళమన్న కనీసం జ్ఞానం లేకుండా సీట్లల్లో మగవాళ్ళు కూర్చొని,లేవనుకూడాలేవరు.వీళ్ళనని లాభం లేదండీ
బస్సులు తగ్గించిన ఆర్టీసీ వాళ్ళననాలి అంటూ పక్క నున్న ఇంకో టీచర్ అన్నారు.నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూసాను.ఎంతమంది ఉన్నారండీ రోజు ఉద్యోగ రీత్యా బస్సులలో ప్రయాణించే వారు అని అడిగాను.ఆశ్చర్యం నిలబడ్డ వాళ్ళలో దాదాపు ఏడెనిమిది మంది వున్నారు.ఒక్కొక్కరు తమ తమ బాధను వ్యక్తం చేశారు.పటాన్ చెరువు వచ్చింది, కండక్టర్ ని రిక్వెస్ట్చేసాను, కొంచెం బస్టాండులో ఆపమని, కానీ ఇంత రష్ లో, పాసింజర్లు ఇంకా ఎక్కడ ఎక్కుతారు, కుదరదు అని నిర్మొహమాటంగా చెప్పాడు.నా అదృష్టం బాగుండి
సరిగ్గా బస్టాప్ మేయిన్ రోడ్డు లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.బస్ ఆగింది, నేను విండో లో నుంచి చూసి,నల్ల రంగు షర్ట్ వేసుకున్న డాక్టర్ కజిన్ కనిపించాడు, నాకు ముందే చెప్పాడు, నేను నల్ల రంగు షర్ట్ ఉన్నాననీ, అది నాకు ఉపయేగపడింది.నాకు సర్టిఫికేట్లు ఉన్న కవర్ ని నాకందించాడు.మీరే కదా ప్రమోద్ అని రెండు మూడు సార్లు అడిగాడు అవునండీ నేనే ప్రమోద్ మీరిచ్చిన ,ఈ సర్టిఫికేట్లు చాలా భద్రంగా డాక్టర్ గారికి అందజేస్తాను,అని చెప్పి తీసుకున్నాను.ఒరిజినల్ సర్టిఫికేట్లను ఓపెన్ కవర్ లోనేఇచ్చాడు.కవర్ అంటే పాలిథిన్ కవర్.పీడియాట్రిక్ సర్జరీ,పీజిఐ చండీగఢ్ లో, కంప్లీట్ చేసారు ఆ డాక్టర్..నిజంగా,ఎంత అద్భుతం.దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఇనిస్టిట్యూట్, అందులో సీటు దొరకడమే చాలా కష్టం. తన పన్నేండేళ్ళ కలనుసర్టిఫికెట్ల రూపంలో,నా బ్యాగ్ లో చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను.సంగారెడ్డిలో నా పక్కన కూర్చున్న ఒక వ్యక్తి దిగిపోయాడు.ఇంకోతడు కూర్చున్నాడు.అతను ఒక ఉపాధ్యాయుడు.రోజు రోజు బస్ ప్రయాణంలో తన అనుభవాలను,కష్టాలను ఏకరువు పెట్టారు.బస్సులు టైంకి రాకపోవడం,బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గించడంఇత్యాది కారణాల వల్ల ఉద్యోగులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పనితీరుపై ఓ నజర్ వేద్దాం....ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపిఎస్ ఆర్టీసీ ఒక వెలుగు వెలిగింది.అయినా అప్పుడప్పుడు ఆర్టీసీ లాస్ లో నడుస్తుందన్న వార్తలు వినిపిస్తూనే ఉండేవి, కానీ ఎప్పుడూ సంస్థ దివాళా తీసినట్లు ధాఖళాలు లేవు.కాలం మారింది, తెలంగాణ వచ్చింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో,కార్మికుల సమస్యలు,హక్కుల గురించి యూనియన్లు చేసిన సమ్మె చివరికి వారి మెడకే చుట్టుకుంది.దీని తరువాత మరే సంస్థ కూడా సమ్మె చేయడానికి సహాసం చేయలేదు.కార్మికుల సమస్యలు,వాటి పరిష్కారం కోసం తమ నిరసనను, తెలియజేస్తూ, మేనేజ్మెంట్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే సమ్మె.యాజమాన్యంతో,సంప్రదింపులు జరిపి, వాళ్ళ కోరికల్లో, కొంత శాతం సాధించుకోవడం చేస్తుంటాయి, ట్రేడ్ యూనియన్లు.గత యాబై సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో ఇదే జరుగుతోంది.కానీ తెలంగాణలో, దానికి బ్రేక్ పడింది.సుమారు అరవై రోజులు సమ్మె చేసాక కూడా ప్రభుత్వం దిగి రాలేదు.చివరికి యూనియన్ల మాటను బేఖాతరు చేస్తూ, కార్మికులు తమ కుటుంబ సభ్యుల పోషణ కోసం,తిరిగి తమ డ్యూటీలలోచేరారు.ఇగ అప్పటి నుంచి వాళ్ళకు చుక్కలు కనిపించాయి.జీతాలు టైంకి రాకపోవడం, చాలా వరకు బస్సులను తగ్గించడం, డ్రైవర్, కండక్టర్లకు డ్యూటీలు
దొరకక, వాళ్ళు కొట్టుకోవడం, ఇలా ఎన్నో జరగకూడనిసంఘటనలు జరిగాయి.వాటి గురించి మళ్ళీ ప్రత్యేకంగా,రాస్తాను.ఆ విధంగా ప్రభుత్వం ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేయడంలో విక్టరీ సాధించింది.అసలు ఆర్టీసీ నష్టాల్లో ఎందుకు నడుస్తుంది,అనీ ఒక సారి ఆలోచించి, నేను చాలా మంది కార్మికులు, సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడాను.అప్పుడు నాకు తెలిసిన నిజాలు, చాలా ఆశ్చర్యానికి గురి చేసాయి.బస్సు.... దానికి ఏమైనా రిపేర్లు వస్తే చేయడానికి ఒక వర్క్ షాప్,అందులో, రిపేరు చేసే కార్మికులు, బస్సులను కడగడానికి అవుట్సోర్సింగ్ టెండర్లు పిలిచిచేయిస్తారు.బస్సు తోలడానికి డ్రైవర్ కండక్టర్లు.ఇంకొందరు మానిటర్ చేసే, ఎంప్లాయిస్ అవసరం.ఓకే నేను ఒప్పుకుంటాను.కానీ అడ్మినిస్ట్రేషన్వైపు అనవసర రిక్రూట్మెంట్స్ చేసి,బస్ భవన్ లో చాలా మందికి జీతాలు ఇస్తున్నారు.ఇది అవసరం లేదు.పాపం డ్రైవర్ కండక్టర్లు నెల నెలా తమ ఇంస్టాల్ మెంట్లు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.వాళ్ళకు ఎప్పుడో పదోవ తారీఖున జీతాలు వేస్తే, ఎలా అన్నది ప్రశ్న.బస్ భవన్ ఉద్యోగులకు ముందే జీతాలు వేస్తే, డ్రైవర్ కండక్టర్ల పరిస్థితి ఎందీ.ఆంటే నా ఉద్దేశ్యం ముందు కింది స్థాయి ఉద్యోగులను పట్టించుకోవాలని.ప్రస్తుతం....చాంద్రాయణగుట్ట...ఆరామ్ ఘడ్...మెహదీపట్నం...
అంటూ కండక్టర్లు ప్రతి స్టాప్ దగ్గర అరుస్తున్నారు.ఇదీ ఇంతకు ముందు నేనెప్పుడూ వినలేదు... చూడలేదు.నిజంగా డ్రైవర్ కండక్టర్లు చాలా ఓపికగా ప్రతి స్టాప్ దగ్గర ఆపి బస్సు ఎక్కమనీ అరుస్తూ ముందుకు సాగిపోతున్నారు. జిల్లా బస్సులు ఆగిన ప్రతి టౌనులో, కండక్టర్ మద్యలో వచ్చే ఊర్ల పేర్లను ఉచ్చరిస్తూ, పెద్దగా అరుస్తూ ఉండే అరుదైన సంఘటనలను చూస్తున్నాం.బస్ లో ప్రయాణికులు, డ్రైవర్ కండక్టర్లుప్రభుత్వాన్ని తిడుతూనే కాలం గడుపుతున్నారు.అర్థం కాని గందరగోళం మధ్య పన్నెండికిగుల్బర్గా చేరాను......

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి