నలుడు నీలుడు ;-మమత ఐలహైదరాబాద్9247593432


 కథ:- (తేటగీతులతో)
***************************
తే.గీ
ముని సుదీక్షనుడెప్పుడు మోదముగను
యజ్ఞ యాగాల కోసమై యాశ్రమమున
పండ్లు పూవులు దర్భలు పత్రములను
చక్కగా బెట్టి యుంచగా సమయ మందు

తే.గీ
రెండు కోతలుజేరి యా రిదముజూసి
యజ్ఞ సామాగ్రి కొద్దిగన్నపహరించి
జలధి యందునన్ విసిరేసి సంచరించ
మౌని కోపించ లేకుండె వానరులని

తే.గీ
దినదినంబునన్ యీవింత దిగులు బెంచ
వానరులుగాన శపియించలేనె యనుచు
నేమి జేతుమా యనిమౌని నీరసించి 
సులభ శాపంబు బెట్టెను చూడుమనుచు

తే.గీ
మీరు విసిరేయు వస్తువల్ నీరు పైన
మున్గ కుండకన్ తేలేను ముదముతోడ
యనుచు చెప్పిన మునివాక్కు ఘనతతోడ
ఫలితమును పొందె మరుజన్మ వారు కొరకు

తే.గీ
నాడు సుగ్రీవ రాజ్యాన నలుడు మరియు
నీలుడను పేరుతో జన్మనెత్తిరచట
రామసేతువున్ నిర్మించ రాళ్ళనెత్తి
సంద్రమునవేయుటకు వీరు సాయపడిరి

తే.గీ
పారవైచిన రాళ్ళన్ని పైకిదేలి
సేతు నిర్మాణమేసాగె మాత కొరకు
నాటి శాపంబు నేర్పుతోనావిధముగ
యుక్తిగన్ వాడిరచ్చటాభక్తవరులు

తే.గీ
పూర్వ జన్మాను సారంబె నుర్వినందు
పాప పుణ్యాల కర్మలు వచ్చుననుచు
నలుని నీలుని జన్మతో దెలియుచుండె
గాన రామనామంబుతో గలుగురక్ష

తే.గీ
రామసేతువు గట్టిన రమ్య స్థలము
గాంచ రామేశ్వరంబున గలదుచూడఁ
లంక జేరేటి మార్గంబు శంకరున్ని
తలచి నిర్మించె వారధి జలధినందు

కామెంట్‌లు