ఎలుక తోలు;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వేమన రాసిన ప్రతి పద్యం  ప్రతి ఒక్కరి నోటా పలుకుతుంది  దాని అర్థం కూడా తేలిక గానే తెలుస్తోంది  వాల్మీకి రామాయణం లో ధర్మం తెలుస్తుంది కానీ  ఆ మహర్షి చెప్పదలుచుకున్న ధర్మసూక్ష్మం చాలా కొద్దిమంది  విద్వాంసులకు మాత్రమే అర్థమవుతుంది  ఇది జగమెరిగిన సత్యం  అలాగే వేమన చెప్పిన అతి లోతైన అర్థాలను  అలతి అలతి పదాలతో అల్లి  మన మనస్సులను దోచుకునే విధంగా  ఆటవెలదులను  మనకు అందించాడు. దాని అంతరార్థం తెలియక మనం కూడా ఆ వేళాకోళం చేస్తున్నాము. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా  నలుపు నలుపే కానీ తెలుపు రాదు  అన్న పద్యం రానిది ఎవరికీ దాని అర్థం తెలిసిన ఎవరికి ప్రతి అక్షరం కూడా ఎంతో విచిత్రంగా ఉంది కదా అనిపిస్తుంది. కానీ జ్ఞాన సంపన్నులు  ప్రతి అక్షరాన్ని విశ్లేషించి వేమన మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారే ఎలుక తోలు ఎలా ఉంటుంది  నల్లగా ఉంటుంది  నలుపు దేనికి సంకేతం  చీకటికి  చీకటిలో ఎవరు ఉంటారు  అజ్ఞానులు తప్ప విజ్ఞానులు ఎవరూ ఉండరు  కంటికి వెలుగు కనిపిస్తున్నంత వరకే  మనిషి ఆనందిస్తూ ఉంటాడు  ఆ ఆనందం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు  ఏ చిన్న కొవ్వొత్తి దొరికినా  దాని ఆధారంతో వీడు బయట పడడానికి ప్రయత్నం చేస్తాడు  జీవితాంతం ఆ తిమిరం (చీకటి) లోనే జీవించాలని ఏ ప్రాణి అనుకోదు కదా. అయితే ప్రయత్నం మాత్రం అనుక్షణం చేస్తూనే ఉంటాడు నిద్రాహారాలు మాని చేసినా  మార్గం సుగమం కాదు  ఎందుకంటే అతను ఉన్న చీకటి లో ఏ ఒక్క వస్తువు తనకు కనిపించదు. ఇప్పుడు ఆలోచించండి  నల్లటి తోలు ను మానవ మస్తిష్కాన్ని బుర్రను బుద్ధిని  ఈ అజ్ఞానిని విజ్ఞానిగా చేయడం కోసం  ప్రయత్నం చేసినా అతను చీకటి వదలడు. అలాగే ఏ కొయ్య ముక్కనో, తీసుకువచ్చి  నేలకేసి కొట్టినంత మాత్రం చేత  అది పలుకుతుందా? ఎక్కువ సేపు కొడితేగాని రూపురేఖలు మారిపోతాయి తప్ప దాని నుంచి ఎలాంటి శబ్దము మనం వినలేము. మన శ్రమ వృధా అవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు ఏ విషయాన్ని మార్చగలమో, దానిని మార్చడానికి మానవ ప్రయత్నం చేయాలి తప్ప  జీవితంలో మారదు అనుకున్నదాని కోసం ప్రయాస పడ వద్దు అని వేమన తన ఆటవెలదిలో స్పష్టంగా  మనకందించారు.ఈ పద్యాన్ని మీరు కూడా చదివి  లోతైన అర్థం మీకు  మరొకటి తెలిస్తే  దానిని కూడా వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి.

"ఎలుక తోలు దెచ్చి ఏడాది యుతికినా నలుపు నలుపె గాని తెలుపు గాదు  కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన బలుకునా..."


కామెంట్‌లు