ఏడు మార్గములు;-ఏ బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆస్తికులలో కూడా అనేక రకాల భేదాలు కనిపిస్తూ ఉంటాయి. అవి సామాన్యులకు అర్థం కాకపోవచ్చు  భగవంతుడు ఎక్కడ లేదు  అణువణువునా వ్యాపించి ఉన్నాడని వేదాంతులు చెబుతున్నాడు నీలోనే ఉన్నాడు భగవంతుడని మరి కొందరు చెబుతున్నారు. అహంబ్రహ్మాస్మి అంటూ  అలాంటి వారి కోసం కొన్ని బొమ్మలు పెట్టి  ఆ బొమ్మకు పూజలు చేసి  సమయమంతా దాని కోసం వృధా చేస్తూ ఉంటారు  భగవంతుడు ఈ ఆకారంలోనే ఉన్నాడని ఎవరైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా?  వెలుగుగా ఆయనను వర్ణిస్తారు తప్ప ఫలానా ఆకారం అని ఏ ఒక్కరూ చెప్పరు  మీరా  శ్రీ కృష్ణ పరమాత్మను పూజిస్తే  రామకృష్ణ పరమహంస అమ్మవారి విగ్రహాన్ని  పూజించారు. ప్రతి గ్రామంలోనూ  శ్రీరామచంద్రమూర్తి ఆలయం వుండి తీరుతుంది  ఈ ఆకారాలు మాత్రమే ప్రభుత్వ రూపాలు అని ఎవరైనా నిర్దేశించగలరా. కనుక భగవంతుడు సాకారుడు కాదు  నిరాకారుడు అని కొంతమంది  చెబుతూ ఉంటారు  మరికొంతమంది మనసులు  నిశ్చలంగా ఉంచుకోవడం కోసం ఆ విగ్రహం పెట్టుకుని దాని మీద కేంద్రీకరించి ఉన్నట్లయితే  కొంత కాలానికి ఆ విగ్రహం లేకుండా నిరాకారమైన ఆకారాన్ని  పూజించే  తత్వం భక్తునికి వస్తుంది అని వ్యాఖ్యానించి చెపుతూ ఉంటారు. ఎవరు చెప్పినా ఈ వ్యాఖ్యానాన్ని ఈ భక్తుడు అనుసరించాలి. కొత్త భక్తులకు ఇది కొంత గందరగోళంగా ఉంటుంది. మనం సూర్యకిరణాలు చూస్తున్నాం తెల్లగా ఉంటుంది  అంత మాత్రం చేత దానిలో వేరే రంగులు ఏవి లేవా  సప్తవర్ణాల శోభితం అని వర్ణిస్తారు కదా సప్తాశ్వముల మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడు అనేది కూడా ప్రమాణమే కదా వీటిలో దేనిని నమ్మాలి.శాస్త్రీయంగా పరిశోధన జరగడం కోసం  ఆ సూర్య కిరణాల్ని  పట్టకం ద్వారా నిర్వహిస్తే దానిలో స్పష్టంగా ఏడు రంగులు కనిపిస్తాయి  అంటే  తెల్లగా ఉన్న ఆకారం లో ఏడు రంగులు కలిసి ఉన్నాయి  అన్ని రంగులు వేయడం వల్లనే  తెల్లటి రంగు ఏడ పడుతుంది  అని చెప్పే శాస్త్రవేత్తలు ఉన్నారు  ఈ ప్రపంచంలో పదార్థాలు కానీ, దేహాలు గానీ, తత్వాలు గానీ, చక్రాలు గానీ ఆభరణాలు కానీ  ఏవైనా ఏడుగా ఉన్నవే  ఆ ఏడు కలిపి ఏమవుతుందో అది తెలుసుకునే తత్వం కోసమే  తపస్సు  తప్ప సమాజానికి దూరంగా వెళ్లి పూర్తి దర్శనం చేసుకున్న తరువాత వారికి తెలిసే విషయం అంతా ఒకటే. ఆ స్వరూపాలలో ఉన్న ఏది నిజము కాదు అన్నది స్పష్టంగా తెలుస్తోంది అదే భగవత్ స్వరూపమని వారు నమ్ముతారు. భగవత్ స్వరూపంలో తాను ఉన్నట్టుగా  గ్రహించడమే వేదాంతం. దాన్ని వేమన గారి పద్యంలో చూద్దాం.


"ఏడు మార్గములను నేకాంతమున చేరి 
యాడి పాడి ముక్తి గూడి వేడి జాడలోని బయలు సాధించి కనవలే..."


కామెంట్‌లు