రాజబాబు నాటకాలు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 కోనేరు రాజబాబు స్వతహాగా  వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చినా  ఉద్యోగం రైల్వేలో వ్యవసాయ కుటుంబీకుల మనస్తత్వాల గురించి బాగా పని తెలిసినవాడు. వ్యవసాయం చేసే దానిలో సాధకబాధకాలు అనుభవించిన వాడు  కనుక మా వై హనుమంతరావు  వ్యవసాయ శాఖ చూస్తున్న వారిని కలిసి ఈ విషయం చెబితే  నాటకాల ద్వారా  తాను చెప్పదలుచుకున్నది ఉంటే చెప్పమను లేకపోతే అవసరం లేదు అని సలహా ఇచ్చారు. నెలకు ఒక నాటకం రాసి ఇచ్చేవాడు  దానిని నేను నా బృందంతో నిర్వహించే వాడిని. రాజ బాబు కోరిక ప్రకారం ప్రధాన పాత్ర నేనే వహించే వాడిని ఈ నాటకాలు జరుగుతున్నప్పుడే సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. దానిని దృష్టిలో పెట్టుకొని 15 నిమిషాలు దాటకుండా నాటకాలు రాయవలసి  వచ్చేది. దానిని దృష్టిలో పెట్టుకొని దాదాపు అరవై నాటకాలు వరకు రాసి ఇచ్చాడు. అతని నాటకం వస్తుందంటే శ్రోతలు ఎంతో ఆనందంగా ఎదురుచూసేవారు  వీరి నాటకాలు ప్రఖ్యాత ప్రవక్త, ప్రవచనకర్త  ఉషశ్రీ గారికి చాలా ఇష్టం  కారణం అడిగితే  పాత్రల ప్రవర్తన చాలా సహజంగా ఉంది అంటూ అభినందించే వారు.
మానవ మనుగడను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి కోనేరు  సగటు మనిషి  జీవితాన్ని గురించి వారి బాధను గురించి కొన్ని నాటకాలు రాశారు  ఉద్యోగస్తులు అనుభవిస్తున్న  అనేక లోతైన విషయాలను గురించి ఎనిమిది నాటకాలు రాశారు. సామాన్య స్త్రీ మనుగడలో ఎలాంటి అవమానాలు పొందవలసి వస్తుందో ఆమె అలాంటి వారిని గురించి అనేక నాటకాలు  ఆకాశవాణిలో ప్రసారం చేసింది రాజబాబు. రాసిన ప్రతి నాటకానికి వేల సంఖ్యలో శ్రోతల నుంచి ఉత్తరాలు వచ్చేవి. అనేక నాటకాలు పునః ప్రసారం అయ్యేవి. రాజబాబుది ఒక శకం అని చెప్పాలి. కోనేరు రాజబాబు ఆకాశవాణికి అనేక నాటకాలు రాశాడు. దానిలో స్త్రీ నాటకం ఉషశ్రీ గారికి నచ్చి ఇది రేడియో కన్నా సినిమాగా బాగుంటుంది అని సలహా ఇచ్చారు. దాంతో దాసరి నారాయణరావు గారిని కలిసి  తన దగ్గర అసోసియేట్ గా పని చేస్తున్న విజయ్ కుమార్ ని పంపించారు. నేను, రాజలక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించాము. మిగిలిన వారంతా కొత్తవారే.  దీనిలో విశేషం మా గురువు గారు ఉష శ్రీ గారు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించడం ఆయన జీవితంలో ఇదే మొదటిసారి.
సశేషం...

కామెంట్‌లు