కోరిన వరాలిచ్చే అన్నవరం సత్యనారాయణ స్వామి; సి.హెచ్.ప్రతాప్ ;-సెల్ ; : 95508 51075
 శ్రీ సత్యనారాయణ స్వామి వారి  దేవస్థానం యొక్క అత్యంత విలక్షణమైన లక్షణం రత్నగిరి కొండలపై ఉన్న వీర వెంకట సత్యనారాయణ స్వామికి పుణ్యక్షేత్రం. ఈ భూమి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం మరియు దేవత అనంతలక్ష్మి సత్యవతి అమ్మవారు రెండింటికి చెందినదిగా పరిగణించబడుతుంది . అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి చాలా ప్రసిద్ధమైంది. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరంలో రత్నగిరి కొండమీద ఉంది.  స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండ గా మారుతాడు. 
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపం ఉన్నాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు ఉన్నాయి.అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం 1934 లో జరిగింది. ఈ ఆలయ నిర్మాణం రెండు అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతా మూర్తులు. ప్రధాన ఆలయం రధాకారంలో నాలుగువైపులా చక్రాలతో నిర్మింపబడింది. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తుంటుంది.
ఉగాది, శ్రీరామనవమి, వినాయక చతుర్థి, శరన్నవరాత్రులు, సంక్రాంతి మొదలైన పర్వదినాల రోజులలో కల్యానోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలలో సంపన్నమైన ఆలయంగా సత్యదేవుని ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఎప్పుడు భక్తులతో, యాత్రికులతో ఈ క్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది
సి హెచ్ ప్రతాప్ 


ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
 

కామెంట్‌లు