మనిషికి అవసరం ;-ఎం. వి. ఉమాదేవి బాసర.
సంపదలున్నా లేకున్నా 
మంచి ఆలోచనల భాగ్యం 
మనసుకి మనిషికి ఎంతో అవసరం 
అనేకానేక ఈతి బాధలున్నపుడు 
ఒకనిర్వేదం మనసులో ఏర్పడి 
మానసిక ఆరోగ్యం దెబ్బతిని 
తనకుతనే భారమయ్యే స్థితిలో దీనతావస్థలో 
క్రుంగిపోతుంటారు. 
అటువంటి వారిని సమాజం 
పిచ్చివాళ్ళుగా ముద్రవేయడం కంటే 
అర్ధం చేసుకొని ఆదరణ చూపిస్తే 
కోలుకొంటు మనోనిబ్బరం పొందుతారు !

అతిగా ఆలోచన, ఎవర్నీ నమ్మని బుద్ధి
ఎంతో హాని చేస్తాయి!
విద్యార్థులకి పరీక్షలో అపజయం, 
మహిళలకు గృహహింస 
నిరుద్యోగపర్వం ఇలాంటివన్నీ
 అధిగమించి ఉపాధిమార్గం చూడవలె !

పుట్టుకతో వైకల్యమున్నా 
వారికి విద్యాబుద్ధులు 
చేతివృత్తులు నేర్పేగొప్ప  సంస్థలున్నాయి 
వాటిలో మొన్న కొవ్వొత్తుల తయారీ చేశారు 
అవి ఎంతో బాగున్నాయ
.కొందరు ఆర్డర్ ఇచ్చారు కూడా. 
ఇలాంటి సంస్థలకు తప్పక సాయం చేద్దాం!
మానవత్వం పరిమళం అదే !!


కామెంట్‌లు