ఆత్మకథ... నా అనుభవం !;-కోరాడ నరసింహా రావు.
 * ఆత్మకథ * అనగానే... నాకు 
గాంధీజీ ఆత్మకథే గుర్తొచ్చింది!
చాలాకాలం క్రిందట ( మైఎక్సపె రిమెంట్స్ విత్ ట్రూత్ )గాంధీజీ ఆత్మకథ, చదివే భాగ్యం కలిగిం ది ! 
      తరువాత సెహ్రూ జైలు లో
ఉన్నపుడుతనకూతురు యింది
రాగాంధీకి రాసిన ఉత్తరాలుచద వటమూ నా అదృష్టమే... !
   ఇలాంటి రచనలు చదవటం మూలంగా ఆయావిశిష్టవ్యక్తుల
అంతరంగాలు...వారివాస్తవఅభిప్రాయాలు,ఆనాటి సామాజిక స్థితి,గతులు...ఇతరవ్యక్తులతో వారిఅనుభవాలు,ఎన్నెన్నోతెలుసుకోగలిగే అవకాశం కలుగు 
తుంది!ఇది నా స్వీయానుభవం 
  
 ఎందరో ఇలాంటి గొప్పవ్యక్తుల 
ఆత్మకధలుపాఠకులకుస్ఫూర్తిని కలిగిస్తాయనేది సత్యం !
 యాదృచ్చికంగా... నాఆత్మకథ కూడా  నూటఎనిమిది భాగాలు గారాసుకునేఅవకాశాన్నిప్రముఖరచయిత Dr.Klv.ప్రసాద్గారు
కలిగించారు ! 
 వారు,వారిజ్ఞాపకాలను జ్ఞాపకా లపందిరి శీర్షికనప్రచురిస్తూ... 
మీరుకూడా మీ జ్ఞాపకాలను అనుభవాలను రాయండి అని వారు కోరటం.,నాకంతగా ఇష్టం
లేకపోయినా... వారి మాటను కాదనలేక నేను నా పుట్టుకతో ప్రారంభించి,రెండుభాగాలు
రాయటం...వాటిని మొలక సంపాదకులు * బ్రతుకు బాట *
శీర్షికనప్రచురించి,చాలాబాగుందిపూర్తిగామీజీవితానుభవాలనురాయండిఅనివారుప్రోత్సహించటంతో...రోజుకొక భాగం 
మొత్తం నూట ఎనిమిది భాగా లుగా నాఅరవయ్యేళ్ళ  జీవితా నుభవాలను ఉన్నవిఉన్నట్టుగా 
ఎటువంటి సిగ్గు, బిడియము లకుతావీయకుండాఉన్నవేవీ విడిచిపెట్టకుండా, లేనిదొక అక్షరమైనా రాయకుండా నావాస్తవ జీవితాన్ని, నాపరిచయాలు, వారితో నాకున్న అనుభవాలను యధాతధంగా రాసి పంపటం వారు ప్రచురించటం నా పూర్వకర్మల సుకృత ఫలంగా భావిస్తున్నాను !, 
    నానూట ఎనిమిదవ భాగం చదివి మొలక సంపాదకులు వేదాంత సూరి గారు... మీ బ్రతుకు బాటను ఆపేస్తున్నా రేంటి, ఆపొద్దు కొనసాగించండి అని వారు కోరినా... అప్పటికి నాజీవితానుభవాలు  ఇప్పటికి ఇంతేనని, బ్రతుకుబాట శీర్షికన ప్రస్తుతానికింకేమీలేదనిచెప్పటం తో,మీఆత్మకథ చాలాబాగుంది పుస్తకరూపంలో ప్రచురించమని వారు కోరినా... నాకా ఉద్దేశం లేకపోవటంతో....విరమించు
కున్నాను !
  నా ఆత్మకథ రాయటానికి నన్నెంతగానో ప్రోత్సహించిన మిత్రులు Dr.Klv.ప్రసాద్గారికీ, 
వేదాంత సూరిగారికీ రుణపడి ఉంటాను !
 నాలాంటి వారి ఆత్మకథలు గొప్పగా ఉంటాయనికాదు, సామాన్యుల జీవితాలు సామాజిక పరిస్థితులకు ఎలా ప్రభావితమౌతాయనేది తెలుస్తుంది !ఆంతే... !!
    మిత్రులకెవరికైనా అవకాశం ఉంటే...నాఆత్మకథనుమొలకలో చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను, ఆశీస్సులను అందిస్తారని ఆసిస్తూ మీ... 
   కోరాడ.  
     ********

కామెంట్‌లు